Free Electricity: గ్రామానికి ఉచిత విద్యుత్ బహుమతి.. వ్యాపారవేత్త నిర్ణయం.. గతంలో ఉద్యోగులకు కార్లు..

     For Quick Alerts 

Subscribe Now      

Free Electricity: గ్రామానికి ఉచిత విద్యుత్ బహుమతి.. వ్యాపారవేత్త నిర్ణయం.. గతంలో ఉద్యోగులకు కార్లు.. 

For Quick Alerts 

ALLOW NOTIFICATIONS      

bredcrumb

bredcrumb

   |                                           Published: Monday, September 26, 2022, 17:36 [IST]                   

Govind Dholakia: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దుధాల గ్రామానికి దీపావళి కానుక వచ్చింది. ఈ ఏడాది గ్రామం అంతా దీపాలతో వెలిగిపోతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఢోలాకియా కుటుంబం గుజరాత్‌కి చెందిన శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకు యజమానిగా ఉంది. ఈ కుటుంబం అమ్రేలి జిల్లాలోని తమ స్వగ్రామమైన దుధాలాకు ప్రత్యేక బహుమతిని అందిస్తోంది. ధోలాకియా కుటుంబం గ్రామంలోని 850 కుటుంబాలకు సోలార్ ప్యానెల్ పైకప్పులను బహుమతిగా అందించింది. దీంతో గ్రామస్తులకు ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.

వజ్రాన్ని పాలిష్ వ్యాపారం..  

వజ్రాన్ని పాలిష్ వ్యాపారం..

గోవింద్ ధోలాకియా 1970లో శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. ఢోలాకియా ఉద్యోగం కోసం 1964లో తొలిసారి సూరత్‌కు వచ్చారు. అక్కడ అతను వజ్రాల పాలిషింగ్ పనిని ప్రారంభించారు. కష్టపడి కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వ రాయితీ లేకుండా 100% సౌర విద్యుత్‌ను అందిస్తున్న దేశంలోనే మొదటి గ్రామంగా ఇది నిలిచింది. ఉద్యోగులు ఖరీదైన బహుమతులు..

ఉద్యోగులు ఖరీదైన బహుమతులు..

గోవింద్‌భాయ్ ఢోలాకియా తన తొలినాళ్లలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తన ఉద్యోగుల పట్ల ఎల్లప్పుడూ చాలా శ్రద్ధ వహించేవారు. ఇటీవల ధోలాకియా ఉద్యోగులను, వారి కుటుంబాలతో పర్యటనకు పంపారు. ఉద్యోగులకు కారు, ఇల్లు, బైక్‌ వంటి బహుమలుతు అందించటంతో వార్తల్లో నిలిచారు. గివింద్ భాయ్ తనకున్న భక్తి విశ్వాసాల వల్ల రూ.11 కోట్లను విరాళంగా అందించారు. గ్రామంలో సోలార్‌ ప్లాంట్‌..

గ్రామంలో సోలార్‌ ప్లాంట్‌..

ధోలాకియాలోని శ్రీ రామ్ కృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ గ్రామంలో సోలార్ ప్యానెల్స్‌ను అమర్చే పనిని చేసింది. ఫౌండేషన్ సోలార్ ప్యానెల్ తయారీదారు, ప్లాంట్ డెవలపర్ అయిన గోల్డీ సోలార్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. గ్రామంలోని 232 ఇళ్లు, దుకాణాలు, ఇతర ప్లాంట్ల వద్ద 276.5 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయటంతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆలోచన ఎలా వచ్చిందంటే..

ఆలోచన ఎలా వచ్చిందంటే..

గోవింద్ ధోలాకియా తనకు గత ఏడాది కాలేయ మార్పిడి జరిగిందని, దానిని జీవిత ధానంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కొత్త జీవితం తరువాత, అతను సమాజంలో ఏదైనా ధానం చేయాలనుకున్నారు. అంటే అతను సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల గ్రామ ప్రజలు సంవత్సరాల తరబడి ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రజల్లో ఆనందం..

ప్రజల్లో ఆనందం..

సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేయడంతో ఊరి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కరెంటు బిల్లు ఆదా అవుతుందని, కరెంటు కోత వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగకు ముందు ధోలాకియా ఇచ్చిన ఈ గిఫ్ట్ గ్రామస్తులకు ఏటా వేల రూపాయల విద్యుత్ బిల్లుల చెల్లింపులను ఆదా చేయనుంది.

      English summary

surat based diamond merchant Govind Dholakia installed free solar roof top panels for free in gujarat

surat based diamond merchant Govind Dholakia installed free solar roof top panels for free in gujarat

Story first published: Monday, September 26, 2022, 17:36 [IST]