Bigg Boss Telugu 6: నామినేషన్లో ఆ 10 మంది! నేను దొంగల్లోనే గలీజ్ దొంగని.. రేవంత్ పై అరిచేసిన కీర్తి

బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షో నాలుగో వారం మరింత రసవత్తరంగా మారనున్నట్లు అనిపిస్తోంది. నిజానికి, బిగ్ బాస్ హౌజ్ లో ఎక్కువగా గొడవలకు కారణమై ఎంటర్ టైన్ చేసేది నామినేషన్ల పర్వమే. ఇక ఈసారి నాలుగో వారం నామినేషన్లు కూడా అంతకుమించి అన్నట్లుగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగో వారం నామినేషన్లకు సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడుదల చేసింది స్టార్ మా. ఇందులో కంటెస్టెంట్ల మధ్య చిచ్చు రగిలినట్లే అనిపిస్తోంది. ఈ ప్రోమోలో కీర్తి భట్ ఎమోషనల్ గా అరవడం చూడొచ్చు. మరిన్ని వివారాళ్లోకి వెళితే..

బిగ్ బాస్ తెలుగు 6 నాలుగో వారం నామినేషన్లలో భాగంగా చిత్తూరు చిరుత గీతూ రాయల్ ను నామినేట్ చేశాడు చలాకీ చంటి. ‘నేను గేమ్ లో బాగా ఆడలేదని నన్ను అన్నావ్.. నాకు కెప్టెన్ ఇచ్చిన పని చేశాను. అందరి పనుల్లోకి నేను తల దూర్చను’ అని చంటి చెప్పాడు. దీనికి గీతూ రాయల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. అందుకే సైలెంట్ గా ఉండిపోయింది.

ఆ తర్వాత అర్జున్ కల్యాణ్ కూడా గీతూ రాయల్ నే నామినేట్ చేశాడు. శ్రీహాన్, ఇనయ మధ్యలో దూరి పిట్ట అనే టాపిక్ ను రెచ్చగొట్టడం, గొడవను పెంచడం తనకు నచ్చలేదని అర్జున్ కల్యాణ్ చెప్పాడు. అందుకు ”వాళ్లకు పెంచితే నీకేమైంది. నీకు డిస్టర్బెన్స్ గా అనిపిస్తే లోపలికెళ్లి ఉండాల్సింది. నిన్నెవరు బయట ఉండమన్నారు. ఇనయాను కదా అంది. నిన్ను కాదు కదా, నీకెందుకు మధ్యలో..” అంటూ దురుసుగానే మాట్లాడింది గీతూ రాయల్.

అలా గీతూ మాట్లాడటంతో.. ‘దాని వల్ల నేను ఎక్కువగా డిస్టర్బ్ అయ్యాను. అందుకే అది నా ఫ్రెండ్ గా ఫీలయ్యాడు’ అని ఇనయ సమాధానం చెప్పింది. దీనికి ”నీ ఫ్రెండా.. ఓరియమ్మా.. దేవుడా సామీ” అంటూ వెటకారంగా సమాధానమిచ్చింది గీతూ. ఆ తర్వాత వచ్చిన ఆర్జే సూర్య ఇనయ సుల్తానాను నామినేట్ చేశాడు. నేను అన్ ఫెయిర్ ఆడానని ఎక్కడైనా నిరూపించూ అని సూర్య అనగా.. తనను గాళ్లోకి ఎత్తినేప్పుడు నువ్వెక్కడున్నావ్ అని ఇనయ అడిగింది.

ఇందుకు ‘నీ చేతులు పట్టుకున్నదే నేను తెలుసా.. నువ్ అటు నుంచి ఇటు వస్తే గేమ్ కంటిన్యూ అయ్యేదని నా ఫీలింగ్’ అంతే అని అన్న సూర్యతో ‘పోరా’.. అని స్మైల్ చేస్తూ అంది ఇనయా. అనంతరం ఆరోహిని రాజశేఖర్ నామినేట్ చేశాడు. గేమ్ ప్రకారం నువ్ జైలులో ఉండాలి. కానీ రాలేదు అని రాజశేఖర్ అంటే.. దొంగల్లో పరమ గలీజ్ దొంగను నేను.. రాను నేను అని ఆరోహి సమాధానం ఇచ్చింది.

ఆ తర్వాత ఆరోహి, ఫైమా మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయింది. ”వెనుక ఎన్ని కెమెరాలు ఉన్నాయో, ముందు కూడా అన్ని కెమెరాలు ఉన్నాయి. నువ్ ఎంత పర్ఫామెన్స్ ఇస్తే.. నేను కూడా అంతే ఇస్తా” అని ఫైమా అంటే.. ‘నువ్ అందరినీ మించిన పర్ఫామెన్స్ ఇస్తావ్. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు’ అని ఆరోహి అంది. దీనికి ‘థ్యాంక్యూ అందుకే ఇక్కడికి పిలిచారు’ అని ఫైమా కౌంటర్ వేయడంతో షాక్ అయింది ఆరోహి.

‘ప్రతి ఒక్కరికీ ప్లాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ పెట్టాలి’ అని రేవంత్ మాట్లుడుతుండగా.. ‘బాధ వల్ల బాధ వల్ల అని పదే పదే అంటున్నారు. నా బాధ ఎవరికి ఎఫెక్ట్ అయింది’ అంటూ కీర్తి అరిచింది. ‘బాధ అనే టాపిక్ తీసుకురాకండి. బాధ ఉంటే ఈ బిగ్ బాస్ హౌజ్ కు వచ్చేదాన్ని కాదు’ అంటూ మాట్లాడింది కీర్తి భట్. దీంతో రేవంత్ మాటలకు కీర్తి అరిచినట్లయింది. ఇక ఈ వారం నామినేషన్లలో బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేసిన అర్జున్ కల్యాణ్, కీర్తి భట్ తో పాటు సుదీప, ఆరోహి, శ్రీహాన్, ఇనయా సుల్తానా, రాజశేఖర్, సూర్య, రేవంత్, గీతూ రాయల్ 10 మంది ఉన్నట్లు సమాచారం.