Bigg Boss Nominations: 4వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్.. ఈసారి 10 మంది.. అతడికి మాత్రం బిగ్ షాక్

బిగ్ బాస్.. సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్న ఏకైక షో. వేరే భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే ఇది పరిచయం అయింది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా జనరంజకంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా నాలుగో వారం నామినేషన్స్ లిస్ట్ లీక్ అయింది. అందులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం పదండి!

తెలుగులో బిగ్ బాస్ షో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను భారీ అంచనాల నడుమ మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే, ఇది ఆశించిన రీతిలో ఆదరణను అందుకోవట్లేదు. ఫలితంగా రేటింగ్‌ను రాబట్టడం లేదు.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో మూడు వారాల్లో షానీ, అభినయ, నేహా ఎలిమినేట్ అయ్యారు.

గత వారం మొత్తంలో జరిగిన టాస్కుల్లో చక్కగా ఆడని కంటెస్టెంట్లకు శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున క్లాస్ పీకిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆ వారం సరిగా పెర్ఫార్మ్ చేయని కంటెస్టెంట్లకు ఓటింగ్ నిర్వహించాడు. అందులో అర్జున్ కల్యాణ్, కీర్తీ భట్‌కు ఐదేసి ఓట్లు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరినీ నాలుగో వారానికి నేరుగా నామినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించాడు.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కును సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే చూపిస్తారు. అయితే, ఆరో సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు నిర్వహకులు మరోసారి పాత పద్దతినే వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నుంచి నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే పెట్టారు. దీంతో ఈ వారంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను మరో కొత్త పద్దతిలో నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రతి కంటెస్టెంట్.. సరైన కారణాన్ని చెప్పి నామినేట్ చేసే కంటెస్టెంట్ తలపై టమాటాను మొత్తం పిండేయాల్సి ఉంటుంది. ఈ టాస్కులో కూడా పలువురి మధ్య భారీ గొడవలే జరిగాయని తెలిసింది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో ఇద్దరు కీర్తి భట్, అర్జున్ కల్యాణ్‌ను నాగార్జున నామినేట్ చేయగా.. మిగిలిన వారిలో ఇనాయా, శ్రీహాన్, ఆరోహి, రేవంత్, గీతూ, సుదీప, రాజ్‌, సూర్యలు ఉన్నట్లు ఓ న్యూస్ లీక్ అయింది.

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరిద్దరు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌ అనిపించుకున్నారు. వారిలో సింగర్ రేవంత్ ఒకడు. బయట భారీ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీ కావడంతో అందరూ అతడినే టార్గెట్ చేస్తున్నారు. ఫలితంగా ఫస్ట్ వీక్ నుంచి నేటి వరకూ వరుసగా నాలుగు సార్లూ అతడు నామినేట్ అయ్యాడు.