హైదరాబాద్‌లో కుండపోత వర్షం: రోడ్లపైకి వరద, నగరజీవి అతలాకుతలం

హైదరాబాద్: నగరంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు పొడి వాతావరణం ఉన్నా.. ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, లక్డీకపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, అసెంబ్లీ, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పురా, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, కాటేదాన్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, బోలక్పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్ నగర్, రాంనగర్, దోమలగూడ, చార్మినార్, బహదూర్ పురా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్ నుమా, ఉప్పుగూడ, రామాంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

కుండపోత వర్షం కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వెళుతున్న ఉద్యోగులు, వాహనదారులు వర్షంలో తడిపోయారు. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

#Hyderabadrain #Hyderabad pic.twitter.com/xsutNyBEDt

రోడ్లపైకి మోకాళ్ల లోతు వరదనీరు చేరడంతో వాహనదారులతోపాటు పాదచారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇది ఇలావుండగా, హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.