హీరోయిన్ సాంగ్స్ లేకుండా గాడ్ ఫాదర్.. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై నార్త్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా మలయాళం లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తూ ఉండడం విశేషం.

అయితే గాడ్ ఫాదర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఎంత నమ్మకంగా ఉన్నారో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాలో పాటలు అలాగే హీరోయిన్ తో సాంగ్స్ కూడా ఉండవట. నయనతార ఒక మంచి పాత్రలో నటిస్తున్నప్పటికీ ఆమెతో పెద్దగా డ్యూయెట్ సాంగ్స్ కూడా ఉండవని తెలుస్తోంది. అయితే ఇలాంటి ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే దానిపై కూడా మెగాస్టార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది అని పొలిటికల్ యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ సన్నివేశాలు కూడా ఉంటాయని అన్నారు. ఎక్కడ కూడా ఈ సినిమాలో సాంగ్స్ కావాలని అలాగే ఇతర సీన్స్ కావాలి అని ఆలోచన రాకుండా ఉంటుంది. కథ అంత బలంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో మ్యూజిక్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి అని ముఖ్యంగా థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్లింది అని మెగాస్టార్ తెలియజేశారు. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విధానం తనకు ఎంత బాగా నచ్చింది అని ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో వచ్చే సన్నివేశాలు కూడా ఎంతో బాగుంటాయి అని అన్నారు. పూరి జగన్నాథ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా నటించాడు అని అతనిలో చాలా మంచి నటుడు ఉన్నాడు అని కూడా మెగాస్టార్ తెలియజేశారు.