స్నోడెన్‌కు పుతిన్ పౌరసత్వం.. ఇక రష్యా పౌరుడి మాదిరిగానే..

అమెరికా గూఢచర్య ఆరోపణలు మోపిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ పౌరసత్వం ఇచ్చారు. అమెరికాకు వ్యతిరేక చర్యలు తీసుకున్నారు. ఎడ్వర్డ్ స్నోడెన్..గతంలో అమెరికా నిఘా ఏజెన్సీ కాంట్రాక్టర్ గా వ్యవహరించారు. కాలక్రమంలో అమెరికా రహస్య నిఘా ఆపరేషన్ల వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.

2013లో స్నోడెన్ వెల్లడించిన రహస్యాల్లో చాలావరకు అమెరికాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. అతడిపై అమెరికా ప్రభుత్వం గూఢచర్య ఆరోపణలు మోపింది. క్రిమినల్ నేర విచారణ ఎదుర్కొనేందుకు అతడు స్వదేశానికి తిరిగి రావాలని అమెరికా కోరుతోంది. అమెరికా ఆగ్రహానికి గురైన ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ఆశ్రయం కల్పించింది.

స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైలుపై సంతకం చేశారు. ఇకపై స్నోడెన్ కు రష్యా పౌరులకు లభించే అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయి. దాంతో అతడిని స్వదేశానికి రప్పించడం అమెరికాకు కష్టం కానుంది.