సోనియా స్థాయి తగ్గింది.. ఇక తిరుగుబాటు తప్పదు, బీజేపీ నేత అమిత్

రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్‌ను కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం పంపించాలని భావించారు. దీంతో గెహ్లట్ సీఎం పోస్టుకు రిజైన్ చేయాల్సి వస్తోంది. డిఫాల్ట్‌గా సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవీ వరించనుంది. దీంతో గెహ్లట్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీనిపై బీజేపీ కామెంట్ చేస్తోంది. సోనియా గాంధీ నాయకత్వంపై తిరుగుబాటు మొదలైందని అంటోంది.

బీజేపీ నేత అమిత్ మాలవియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి గెహ్లట్ నామినేషన్ వేసినా.. వేయకున్న పార్టీలో ఉన్న అసమ్మతి బయటపడిందన్నారు. ఇదీ నిజంగా సోనియా గాంధీ స్థాయిని తగ్గించేదని పేర్కొన్నారు. ఇతరులు పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టినా గాంధీ కుటుంబంపై విశ్వసం ఉండకపోవచ్చునని తెలిపారు. తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇన్నాళ్లూ ఏకచత్రాధిపత్యంగా ఉన్న వారి స్థాయి తగ్గిపోయిందని కామెంట్ చేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ సీఎం పదవీని సచిన్‌పైట్‌కు ఇచ్చేందుకు అశోక్‌ గెహ్లట్‌ వర్గీయులు అంగీకరించడం లేదు. హైకమాండ్ ఆదేశించినా ససేమిరా అంటున్నారు. సీనియర్‌ నేతలు అజయ్ మాకెన్‌, మల్లికార్జున్‌ ఖర్గే జైపూర్‌ చేరుకున్న నో యూజ్. ఎమ్మెల్యేలు వారితో భేటీ అయ్యేందుకు నిరాకరించారు. సీనియర్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌ సింగ్‌ ఖాచరియావాస్‌ మాట్లాడారు. సీనియర్‌ నేతలతో సమావేశమయ్యేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, అయితే నవరాత్రి వేడుకల నిమిత్తం వారి నియోజకవర్గాలకు వెళ్లవలసి వచ్చిందని చెప్పారు.

పరిస్థితి చేయి దాటి పోయిందని గెహ్లాట్ అనగా.. అతని సూచనల మేరకే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో గెహ్లట్‌కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు 92 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడ్డారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి గెహ్లట్ పేరు తొలగింది. కొత్తగా మరో ఇద్దరు, ముగ్గురి పేర్లు వచ్చాయి. వారిలో గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నవారికి పట్టం కట్టే అవకాశం ఉంది.