మునుగోడులో గెలిపిస్తే అభివృద్ధి రుచి చూపిస్తా: కేఏపాల్ హామీల వర్షం; తగ్గేదేలే!!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకొని మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించాలని, తమ పార్టీ జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో నేను సైతం అంటూ కే ఏ పాల్ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. మునుగోడు ప్రజానీకానికి కావలసినంత కంటెంట్ ఇస్తున్నారు.

మునుగోడును వదిలిపెట్టని కేఏ పాల్.. అక్కడ యువతకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారుగా!!మునుగోడును వదిలిపెట్టని కేఏ పాల్.. అక్కడ యువతకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారుగా!!

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని మొదటినుంచి తేల్చి చెబుతున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ తాజాగా మరోమారు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తనకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మునుగోడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించి 59 మందికి తన పుట్టిన రోజు సందర్భంగా లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసిన యువతకు యూఎస్ వీసాలు ఇస్తానని ప్రకటించారు, స్థానికంగా ఉన్న 7వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక తాజాగా మరోమారు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాల అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ స్పష్టం చేశారు.

తన 59 వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు లో నిర్వహించిన సభకు హాజరై మాట్లాడిన కేఏ పాల్ టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని కే ఏ పాల్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకు వస్తానని కే ఏ పాల్ హామీ ఇచ్చారు. అంతేకాదు కార్పొరేట్ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గం లోని చిన్నారుల విద్యకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

ఇక ఇచ్చిన మాట ప్రకారం తన 59 వ పుట్టినరోజు సందర్భంగా 59 మందికి యూఎస్ వీసాలు ఇస్తానన్న కే ఏ పాల్ 59 మంది వీసాల లక్కీ డ్రా తీశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కోశాధికారి జ్యోతి, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలతో తలపడుతూ మునుగోడు నియోజకవర్గం లో రాజకీయాలు చేయడం కోసం రంగంలోకి దిగిన కేఏ పాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. పోటీ చేయడం పక్క అని తేల్చి చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని వదిలిపెట్టేది లేదని పదే పదే స్పష్టం చేస్తున్నారు.