మళ్లీ దొరికిపోయిన రవికృష్ణ, నవ్య స్వామి: ఏకంగా అక్కడ ముద్దులు.. అడ్డంగా బుక్కైన జంట

సాధారణంగా గ్లామర్ ఫీల్డులోని నటీనటుల మధ్య లవ్ ట్రాకులు ఉంటాయన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అందుకు ఆద్యం పోసే విధంగా చాలా మంది జంటలుగా మారుతున్నారు. మరికొందరు అలా వ్యవహరిస్తూ అనుమానాలు పెంచుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు బుల్లితెర ప్రముఖులు నవ్య స్వామి, రవికృష్ణ. ఆ మధ్య ఓ సీరియల్‌లో కలిసి నటించిన వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తరచూ కలిసే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రవికృష్ణ, నవ్య స్వామికి ముద్దు పెట్టేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

నవ్య స్వామి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు ప్రవేశించింది. ఈ క్రమంలోనే కన్నడంలో పలు సీరియల్స్ చేస్తూ ఫేమస్ అయింది. అక్కడ ఎన్నో ధారావాహికల్లో నటించిన ఆమె.. ‘తన్‌గాలి’తో విశేషమైన గుర్తింపును దక్కించుకుంది. అలా దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో పాటు హవాను చూపిస్తోంది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

రవికృష్ణ చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే ‘మొగలిరేకులు’ సీరియల్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సీరియల్స్‌లో నటిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇక, ‘వరూధినీ పరిణయం’తో హీరోగా మారడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా ఎన్నో సీరియళ్లలో నటించాడు.

నవ్య స్వామీ.. రవికృష్ణ కలిసి ‘ఆమె కథ’ అనే సీరియల్‌లో జంటగా నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజులు ప్రచారం జరుగుతూనే ఉంది. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో రవికృష్ణ – నవ్య స్వామిని జంటగానే పరిగణిస్తున్నారు. అలానే వీళ్లు నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్న నవ్య స్వామి, రవికృష్ణ క్రేజ్‌ను పలు షోల నిర్వహకులు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీళ్లిద్దరినీ చాలా షోలకు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లతో రొమాంటిక్ స్కిట్లు, డ్యాన్స్‌లు ప్లాన్ చేస్తున్నారు. అలా జంటగా నవ్య, రవి ఎన్నో షోలు చేశారు. ఫలితంగా ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంటున్నారు.

మామూలుగా షోలలోకి వచ్చి వెళ్తే కిక్కేమి ఉంటుంది అనుకుంటున్నారో ఏమో కానీ.. నవ్య స్వామి, రవికృష్ణ కలిసి ఏదైనా షోకి వచ్చారంటే ప్రేమను పండిస్తూనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే ఆ మధ్య సుమ షోలో ఏకంగా ముద్దులతో రచ్చ చేశారు. అలాగే మరో షోలో హగ్గులు, ఇంకో షోలో లవ్ ప్రపోజల్స్‌తో రెచ్చిపోయారు. దీంతో ప్రేక్షకుల్లో డౌట్లను పెంచుతూనే ఉన్నారు.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!
https://telugu.filmibeat.com/television/anchor-vishnupriya-bheemineni-looks-beautiful-in-latest-photos-113265.html

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జీ తెలుగు చానెల్‌లో గత ఆదివారం ‘రారండోయ్ పండగ చేద్దాం’ అనే ఈవెంట్‌ను నిర్వహించారు. దీన్ని ప్రదీప్ హోస్ట్ చేయగా.. ఇందులో ఎంతో మంది ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఇక, ఈ ఈవెంట్‌లో బుల్లితెర జంట నవ్య స్వామి, రవికృష్ణ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అందుకు తగ్గట్లుగానే వీళ్లిద్దరూ మరోసారి రచ్చ చేశారు.

‘రారండోయ్ పండగ చేద్దాం’ ఈవెంట్‌లో భాగంగా రవికృష్ణ, నవ్య స్వామి మరోసారి రెచ్చిపోయి రొమాన్స్‌ను పండించారు. ఇందులో భాగంగానే అతడు మోకాళ్లపై కూర్చుని మరీ తన ప్రేమను వ్యక్త పరిచాడు. అదే సమయంలో ఏకంగా ఆమె చేతిపై ముద్దులు కూడా పెట్టాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఇలా మరోసారి ఈ జంట తమపై వస్తున్న పుకార్లకు బలాన్నిచ్చింది.