భూమికి చేరువగా అస్టరాయిడ్.. తిప్పికొట్టే పనిలో అమెరికా బిజీ

భూమి వైపు వస్తోన్న గ్రహశకలాన్ని తిప్పికొట్టే మిషన్‌ను నాసా సోమవారం అమలు చేయనుంది. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ అఫైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ నిర్వహిస్తోన్న డబుల్ అస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్ ఇంకా పూర్తి చేయలేదు. మరో కోట్ తప్పనిసరిగా చేస్తారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.14 గంటలకు ప్రయోగం జరుగుతుంది.

అయితే అస్టరాయిడ్ వల్ల భూ మండలానికి వచ్చిన ముప్పేమి లేదు. ఆ అస్టరాయిడ్ గమనం పూర్తి గతిశక్తితో మార్చగల సామర్థ్యం ఉంది. ఆ అస్టరాయిడ్ వేగంగా రావడంతో.. దాని నుంచి ఉద్బవించే శక్తి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.

సాయంత్రం 6 గంటల నుంచి నాసా దీనికి సంబంధించిన కవరేజీ పర్యవేక్షిస్తోంది. లైవ్ కవరేజీ నాసా వెబ్ సైట్, యూట్యూబ్ చానెల్‌లో అందుబాటులో ఉంది. ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలో కూడా లింక్ ఇచ్చారు. గ్రహ శకలం ఢీ కొట్టడం అంటే కాస్త ఆందోళనే.. కానీ నిపుణులు మాత్రం నో టెన్షన్ అంటున్నారు.

అయితే గ్రహ శకలం, లేదంటే ఖగోళ వస్తువు యొక్క చలనం మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు. ఇదీ తొలిది కావడం విశేషం.