బతుకమ్మ ఆడుతున్న భార్య.. ఇనుపరాడ్ తో దాడిచేసి హతమార్చిన భర్త; కారణమిదే!!

వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాలలో చిచ్చు పెడుతున్నాయి. ఎన్నో కాపురాలను నాశనం చేస్తున్నాయి. ఎంతో మంది హత్యలకు కారణమవుతున్నాయి. ఇక అనేక కుటుంబాలలో చిన్నారులను అనాధలుగా మారుస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ఘటన బతుకమ్మ పండుగ రోజు చోటు చేసుకుంది.

హోటల్లో సీక్రెట్ గా వేరే మహిళతో భర్త.. భద్రకాళిలా మారి షాకిచ్చిన భార్య; తగ్గేదేలే!!హోటల్లో సీక్రెట్ గా వేరే మహిళతో భర్త.. భద్రకాళిలా మారి షాకిచ్చిన భార్య; తగ్గేదేలే!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ సంతోషంగా నిర్వహించుకునే పూల పండుగ బతుకమ్మ పండుగ నిన్న ప్రారంభం కావడంతో, ఎంగిలిపూల బతుకమ్మ లో భాగంగా మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఆడారు. ఇక సిద్దిపేట జిల్లాలోని వీరాపూర్ గ్రామంలోనూ మహిళలందరూ బతుకమ్మలు ఆడుతున్న క్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బతుకమ్మ ఆడుతున్న మహిళల సమూహంలోకి వచ్చిన ఒక వ్యక్తి ఇనుప రాడ్ తో తన భార్యపై దాడి చేశాడు. తన భార్య వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోందన్న అనుమానంతో బతుకమ్మ ఆడుతుండగా ఆమెను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త.

పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సిద్దిపేట జిల్లా వీరాపూర్‌లో ఆదివారం రాత్రి ఎంగిలిపూల బతుకమ్మ ఆడుతున్న క్రమంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె మంగను స్థానికంగా ఉండే ఎల్లారెడ్డితో వివాహం జరిపించారు. ఒక నెల తర్వాత, మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని మరణించింది. పెద్ద కుమార్తె మరణంతో, ఎల్లమ్మ గోపాల్ రెడ్డి లు తన రెండవ కుమార్తె స్వప్నను మళ్లీ ఎల్లారెడ్డి కి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి దాంపత్యం సాఫీగా సాగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

స్వప్న అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోందని ఎల్లారెడ్డి భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెను వివాహేతర సంబంధం కొనసాగిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఇక ఇదే క్రమంలో ఆదివారం రాత్రి వీరాపూర్ లో భార్య స్వప్న ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతుండగా ఎల్లారెడ్డి భార్య తలపై ఇనుప రాడ్‌తో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

భార్యను హతమార్చిన ఎల్లారెడ్డి అక్కడి నుండి పరారయ్యారు. మృతురాలి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు అందరూ సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగలో భర్త భార్యను హతమార్చిన తీరు స్థానికులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. తండ్రి చేసిన పనితో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.