దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు ‘కవాసకి డబ్ల్యు175’ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి స్టాండర్డ్ మరియు స్పెషల్ ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు మరియు రూ. 1.49 లక్షలు. ఈ కొత్త బైక్ కోసం కంపెనీ ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది. కావున ఈ బైక్ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

  దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు

కవాసకి డబ్ల్యు175 చూడటానికి చాలా కొత్తగా ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇది కొంతవరకు దాని డబ్ల్యు800 ని పోలి ఉంటుంది, ఎందుకంటే డబ్ల్యు175 తన డబ్ల్యు800 నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్, టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు బాక్సీ సైడ్ ప్యానెల్ వంటివి W800 ని గుర్తుకు తెస్తాయి.

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు    ఇక వెనుక వైపు టెయిల్-లైట్ మరియు ఇండికేటర్స్ వంటివి ఉన్నాయి, అంతే కాకుండా వెనుక భాగంలో ఒక వంపు తిరిగిన ఫెండర్‌ని కూడా చూస్తారు. ఇందులో సింగిల్ పీస్ సీటు ఉంటుంది. ఇది మంచి రైడింగ్ పొజిషన్ అందించడం వల్ల రైడర్ అద్భుతమైన రైడింగ్ అనుభూతిని కూడా పొందవచ్చు.

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అనలాగ్ స్టైల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంటుంది. పరిమాణం పరంగా కవాసకి డబ్ల్యు175 పొడవు 2,006 మిమీ, వీల్‌బేస్ 1,320 మిమీ మరియు సీటు ఎత్తు 790 మిమీ వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు కవాసకి డబ్ల్యు175 బైక్ ఎబోనీ (స్టాండర్డ్) మరియు స్పెషల్ ఎడిషన్ రెడ్ (స్పెషల్ ఎడిషన్) అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇందులో ఒకటికి పూర్తిగా బ్లాక్ థీమ్ అయితే, రెండోది రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అయితే రెండింటిలోనూ ఫ్రంట్ సస్పెన్షన్, హెడ్‌లైట్ కేసింగ్, ఇంజన్, స్వింగార్మ్ మరియు ఎగ్జాస్ట్ పైప్ వంటి భాగాలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు కవాసకి డబ్ల్యు175 బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 177 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. కాగా ఇంజిన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు కవాసకి డబ్ల్యు175 యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ లో టెలీస్కోపిక్ ఫోర్క్ మరియు ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌ వంటివి ఉన్నాయి. కావున ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందుభాగంలో ఒకే డిస్క్ మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి.

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు ఇదిలా ఉండగా, కవాసకి ఇండియా ఇటీవల భారతీయ మార్కెట్లో 2023 ‘కవాసకి జెడ్900’ అనే కొత్త బైకును రూ. 8.93 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసింది. ఈ బైక్ దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కూడా రూ. 51,000 ఎక్కువ ధర కలిగి ఉంటుంది.ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కవాసకి ఇండియా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించడానికి ఎప్పటికప్పుడు కొత్త బైకులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త బైక్ ని దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్ మార్కెట్లో యమహా FZ-ఎక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, హోండా సిబి350 మరియు యెజ్డీ రోడ్‌స్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.