ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన

     Bredcrumb

Updated: Monday, September 26, 2022, 13:36 [IST]  

మారుతి సుజుకి (Maruti Suzuki) తన 'గ్రాండ్ విటారా' (Grand Vitara) ను భారతీయ విఫణిలో ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తుందా.. అని ఎదురు చూసేవారికి ఇప్పుడు నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే కంపెనీ మీకు ఎంతగానో ఇష్టమైన 'గ్రాండ్ విటారా' ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ కొత్త 'మారుతి గ్రాండ్ విటారా' గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే?  దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే?

కంపెనీ ఈ SUV ని అధికారికంగా దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విడుదలకు ముందే ఇది 55,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. కావున ఇప్పుడు బుక్ చేసుకునే వారు డెలివరీ కోసం కనీసం 5 నుంచి 6 నెలలు వేచి ఉండాల్సి వుంది. దీన్ని బట్టి చూస్తే గ్రాండ్ విటారాకు డిమాండ్ చాలా ఎక్కువగానే ఉన్నట్లు మనకు స్ఫష్టంగా అర్థమవుతోంది.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే?  మారుతి గ్రాండ్ విటారా మొత్తం ఇప్పుడు 11 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కంపెనీ యొక్క నెక్సా అవుట్‌లెట్ల ద్వారా మాత్రమే విక్రయించబడతాయి.

Variant Monotone Dual Tone  Sigma Smart Hybrid MT ₹10,45,000 -  Delta Smart Hybrid MT ₹11,90,000 -  Delta Smart Hybrid AT ₹13,40,000 -  Zeta Smart Hybrid MT ₹13,89,000 -  Zeta Smart Hybrid AT ₹15,39,000 -  Zeta+ Intelligent Electric Hybrid eCVT ₹17,99,000 ₹18,15,000  Alpha Smart Hybrid MT ₹15,39,000 ₹15,55,000  Alpha Smart Hybrid AT ₹16,89,000 ₹17,05,000  Alpha Smart Hybrid ALLGRIP SELECT MT ₹16,89,000 ₹17,05,000  Alpha+ Intelligent Electric Hybrid eCVT ₹19,49,000 ₹19,65,000  ఇప్పుడు మారుతి గ్రాండ్ విటారా యొక్క టాప్-ఎండ్ వేరియంట్స్ అయిన ఆల్ఫా, జీటా+ మరియు ఆల్ఫా+ ట్రిమ్స్ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి కోసం రూ. 16,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో గ్రాండ్ విటారాను ప్రతి నెలా 27,000 లతో నెలా వారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన డిజైన్ దాని ఫ్రంట్ స్టైలింగ్. దీని ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌పై పూర్తిగా వెడల్పు అంతగా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దాదాపుగా హైరైడర్ ను పోలి ఉంటుంది. అయితే కలర్ స్కీమ్ మాత్రం వేరుగా ఉంటుంది. కావున గ్రాండ్ విటారా దానికి కొంత భిన్నంగా కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ డిజైన్‌ హైరైడర్ మాదిరిగానే ఉంటుంది.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? కొత్త గ్రాండ్ విటారాలో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? గ్రాండ్ విటారా మొత్తం 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆరు మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన మూడు డ్యూయల్ టోన్‌ కలర్స్. మోనోటోన్ కలర్స్ లో నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు ఓపులెంట్ రెడ్ కలర్స్ ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ మరియు ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? ఇక గ్రాండ్ విటారా యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకూండా ఇది సుజుకి యొక్క AllGrip AWD ఆప్సన్ కూడా పొందుతుంది.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? మారుతి గ్రాండ్ విటారా యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన మారుతి గ్రాండ్ వితరా.. ధర ఎంతంటే? డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రాండ్ విటారా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదలైంది. అయితే ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందిన ఈ కొత్త SUV రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. ఇది భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

          English summary

Maruti suzuki grand vitara launched in india at rs 10 45 lakh details