అనుకున్నట్లుగానే

అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!! కంపెనీ అందించిన సమాచారం ప్రకారం మొదటి బ్యాచ్ డెలివరీలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!!

మహీంద్రా స్కార్పియో-ఎన్‌ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు టాప్-స్పెక్ Z8L వేరియంట్స్. ఇందులో మహీంద్రా స్కార్పియో Z4 పెట్రోల్ AT ధర రూ. 15.45 లక్షలు, Z4 డీజిల్ AT ధర రూ. 15.95 లక్షలు, Z6 డీజిల్ AT ధర రూ. 16.95 లక్షలు, Z8 పెట్రోల్ AT ధర రూ. 18.95 లక్షలు, Z8 డీజిల్ AT ధర రూ. 19.45 లక్షల వరకు ఉన్నాయి. కాగా టాప్ లైన్ వేరియంట్ అయిన Z8L పెట్రోల్ & డీజిల్ AT ధరలు వరుసగా రూ. 20.95 లక్షలు, రూ. 21.45 లక్షల వరకు ఉన్నాయి.

అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!! ఇప్పటికే మహీంద్రా అందించిన సమాచారం ప్రకారం, మొదట్లో జెడ్8ఎల్ టాప్ వేరియంట్లను డెలివరీ చేస్తుంది. ఇందులో భాగంగానే రాబోయే 10 రోజుల్లో 7,000 యూనిట్లను డెలివరీ చేయడానికి కంపెనీ సన్నాహాలు సిద్ధం చేస్తోంది. మొదట్లో బుక్ చేసుకున్న 25,000 మందికి మరో నాలుగు నెలల్లో డెలివరీలు ముగిసే అవకాశం ఉంటుంది.

అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!! మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి.

అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!! కొత్త స్కార్పియో-ఎన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా ఉన్నాయి.

అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!! కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్స్ కలిగి ఉంటుంది.

ఇందులోని 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!! మహీంద్రా కంపెనీ ఇతర వాహనాల మాదిరిగానే స్కార్పియో-ఎన్ కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!! డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా కంపెనీ యొక్క కొత్త స్కార్పియో-ఎన్ డెలివరీలు విజయదశమికి ముందే ప్రారంభమయ్యాయి. పండుగ సమయంలో ఇది కస్టమర్లకు చాలా సంతోషకరమైన విషయం. అయితే మిగిలిన కస్టమర్లకు కూడా కంపెనీ త్వరలోనే డెలివరీ చేయనుంది. అయితే సెకండ్ బ్యాచ్ డెలివరీలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఖచ్చితంగా తెలియదు, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.