Sketch: పెళ్లికి రావాలి, పట్టపగలు మత్తుమందు చల్లి రూ. 47 లక్షల క్యాష్, 3/4 కేజీల బంగారు !

బెంగళూరు/కోలారు: కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ఓ రైతు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు మంచిరేటు వస్తే పొలం అమ్మాలని అనుకున్నారు, అనుకున్నట్లు పొలం రూ. 47 లక్షలకు విక్రయించాడు. మగిలిన పొలంలో ఆ రైతు వ్యవసాయం చేయిస్తున్నారు. పొలం రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో ఆ రైతుకు డబ్బులు మొత్తం వచ్చేసింది. రూ .47 లక్షల డబ్బు, 250 గ్రాముల బంగారు నగలు ఇంట్లోనే పెట్టిన రైతు ఇంట్లో భద్రంగా ఉండాలని భార్యకు చెప్పి పొలం దగ్గరకు వెళ్లాడు. పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రైతు భార్య ముఖం మీద మత్తుమందు చల్లి పట్టపగలు రూ. 47 లక్షలు, బంగారు నగలు లూటీ చెయ్యడం కలకలం రేపింది.

Khiladi lady: ఆరు మంది భర్తలు, 7 పెళ్లికి రెఢీ,పెళ్లికొడుకు తాళి కట్టేటైమ్ లో ఆరో భర్త ఎంట్రీ,కన్నింగ్ స్కెచ్!Khiladi lady: ఆరు మంది భర్తలు, 7 పెళ్లికి రెఢీ,పెళ్లికొడుకు తాళి కట్టేటైమ్ లో ఆరో భర్త ఎంట్రీ,కన్నింగ్ స్కెచ్!

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని కోలారు జిల్లా, మాలూరు తాలుకాలోని సంపనగరె గ్రామంలో మంజునాథ్ అనే రైతు నివాసం ఉంటున్నాడు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని మంజునాథ్, మమత దంపతులు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. మంచిరేటు వస్తే పొలం అమ్మాలని మంజునాథ్ ఇంతకాలం వేచిచూశాడు.

ఇటీలవ మంజునాథ్ రెండు ఎకరాల పొలం వేరే వ్యక్తులకు విక్రయించాడు. అనుకున్నట్లు రెండు ఎకరాల పొలం రూ. 47 లక్షలకు విక్రయించాడు. మగిలిన పొలంలో మంజునాథ్ వ్యవసాయం చేయిస్తున్నారు. పొలం రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో మంజునాథ్ చేతికి రూ. 47 లక్షలు డబ్బులు చేరాయి.

రూ .47 లక్షల డబ్బు, 250 గ్రాముల బంగారు నగలు ఇంట్లోనే పెట్టిన మంజునాథ్ ఇంట్లో భద్రంగా ఉండాలని అతని భార్య మమతాకు చెప్పి పొలం దగ్గరకు వెళ్లాడు. పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు మంజునాథ్ ఇంటికి వెళ్లారు, తాగడానికి మంచినీళ్లు ఇవ్వాలని నిందితులు మమతకు చెప్పారు.

మమత నీళ్లు తీసుకుని వచ్చిన వెంటనే ఆమె ముఖం మీద మత్తుమందు చల్లిన నిందితులు పట్టపగలు మంజునాథ్ ఇంటిలో బీరువాలో ఉన్న రూ. 47 లక్షల నగదు, బంగారు నగలు లూటీ చెయ్యడం కలకలం రేపింది. ఇంటికి వెళ్లిన మంజునాథ్ నగలు, నగదు లూటీ అయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పక్కాప్లాన్ తో తెలిసిన వాళ్లే మంజునాథ్ ఇల్లు లూటీ చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.