RaviTeja: రవితేజ సినిమాకు కామెడీ స్కిట్స్ రాసిన జబర్దస్త్ కమెడియన్? వర్కౌట్ అవుతుందా?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు రవితేజ. హిట్లు, ప్లాప్ లు అనే తేడా ఏం లేకుండా వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ వెనువెంటనే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అవి అంత చెప్పుకునేంత టాక్ సంపాదించుకోలేకపోయాయి.

ఇక రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం థమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాకు త్రినాథ రావు నక్కన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ అంటే ఆ సినిమాలో కచ్చితంగా కామెడీ ఉంటుంది. ఖిలాడీలో కామెడీ సీన్లకు సంబంధించిన ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది.

మాస్ మహరాజ రవితేజ హీరోగా, త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ధమాకా. దీనికి డబులు ఇంపాక్ట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఆ క్యాప్షన్ వెనుక ఉన్న కారణం అదేనట. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబోట్ల వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రవితేజ సినిమా అంటే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన టైమింగ్, డైలాగ్ డెలీవరీతో ఆద్యంతం నవ్విస్తారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కామెడీకి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాలో కామెడీ స్కిట్స్ ను జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదితో రాయించారని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ త్రినాథ రావు, హైపర్ ఆది మంచి ఫ్రెండ్స్. ఇదివరకు థ్రినాథ రావు సినిమాలకు రచయిత ప్రసన్న కుమార్ రాసేవారు. ఇప్పుడు హైపర్ ఆది సహాయం తీసుకుంటున్నట్లు సమాచారం. స్టోరీ ప్రకారం సినిమాలో కామెడీ ఎక్కువ ఉంటుందట.

ఆ కామెడీ ఎపిసోడ్స్ ను హైపర్ ఆదితో రాయించుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అక్కడక్కడా జబర్దస్త్ స్టైల్ కనపిస్తుందని చెబుతున్నారు. బుల్లితెరపై కమెడిన్స్ అలాంటి స్కిట్స్ చేస్తే బాగుంటుంది కానీ, రవితేజ లాంటి మాస్ హీరోతో అలాంటి కామెడీ స్కిట్స్ ను ఎంతవరకు పండించగలరో చూడాలి. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో బుల్లితెర నటీనటులు కనిపించడం, అందులోని కామెడీ జబర్దస్త్ స్కిట్ లా ఉందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ ధమాకా మూవీలో పెళ్లి సందD సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన జింతాక్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ, శ్రీలీల ఆడిపాడిన తీరు అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో రవితేజ.. ఒక పాత్రలో ఓ కంపెనీకి సీఈవోగా, మరో రోల్ లో మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం.

రవితేజ రాబోయే సినిమాల విషయానికొస్తే.. ధమాకా చిత్రంతోపాటు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా రావణాసుర మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో న్యాయవాదిగా రవితేజ నటించనున్నాడు. అలాగే హీరో సుశాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.