Oke Oka Jeevitham Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. మరో 25 లక్షలు వస్తే రికార్డు.. లాభం ఎంతంటే!

టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. కొంత కాలంగా సరైన హిట్ లేకపోయినా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ యంగ్ హీరో ‘ఒకే ఒక జీవితం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంచనాలకు అనుగుణంగానే ఇది వసూళ్లను చక్కగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో శర్వా మూవీ 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

శర్వానంద్ – శ్రీ కార్తీక్ కాంబోలో రూపొందిన సినిమానే ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల అయింది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

టాలెంటెడ్ గాయ్ శర్వానంద్‌కు ఆంధ్రా, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. అలాగే ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో ‘ఒకే ఒక జీవితం’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ అయింది.

శర్వానంద్ హీరోగా, శ్రీ కార్తిక్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కథతో ఎమోషనల్‌గా రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. దీంతో రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. ఇక, 16వ రోజు ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 9 లక్షలే వసూలు అయ్యాయి.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’కు 16 రోజుల్లో వసూళ్లు బాగా వచ్చాయి. నైజాంలో రూ. 3.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి రూ. 6.47 కోట్లు షేర్, రూ. 10.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

ఏపీ, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 6.47 కోట్లు వసూలు చేసిన ‘ఒకే ఒక జీవితం’.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 59 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.31 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.07 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 16 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.45 కోట్లు షేర్‌, రూ. 24.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.45 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.45 కోట్లు లాభాలు వచ్చాయి.