Navratri 2022 Day 7: నవరాత్రి ఏడో రోజు ఆరెంజ్ రంగు దుస్తుల్లో ఇలా అదరగొట్టొచ్చు

Navratri 2022 Day 7: ఎప్పుడెప్పుడా అని ఎదురూ చూస్తున్న నవరాత్రి ఉత్సవాలు వచ్చేశాయి. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు దుర్గా దేవిని 9 అవతారాల్లో పూజిస్తాం. ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా మరియు ప్రదర్శనలతో జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది.

నవరాత్రులకు ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరిస్తారు. పండగ ఏడో రోజు కాళరాత్రి రూపంలోని దుర్గా దేవిని పూజిస్తారు. ఏడో రోజును నారింజ(ఆరెంజ్) రంగుకు అంకితం చేయబడింది.
అందమైన చీరల నుండి అద్భుతమైన లెహంగాల వరకు, పండుగ కోసం మీకు అవసరమైన అన్ని స్టైల్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.