Mann ki Baat:చిరుతలు రావడం హ్యాపీ, ఎయిర్ పోర్టుకు భగత్ సింగ్ పేరు: మోడీ

మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఇవాళ 93వ ఎపిసోడ్ సందర్భంగా రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఒకటి చిరుతలు తిరిగిరావడం, రెండోది చండీఘడ్ ఎయిర్ పోర్టు పేరు మార్చే విషయం ప్రస్తావించారు.దేశానికి చిరుత పులుల రావడం పట్ల 130 కోట్ల మంది జనం సంతోషంగా ఉన్నారని మోడీ అన్నారు. ప్రజలు అంతా గర్వంతో ఉన్నారని పేర్కొన్నారు. చిరుతలను టాస్క్ ఫోర్స్ పర్వేక్షిస్తోందని తెలిపారు. జనాలు ఎప్పుడు సందర్శించవచ్చో చెబుతామని వివరించారు.

చిరుతలకు సంబంధించి ప్రచారం కోసం నిర్వహించే కార్యక్రమానికి పేరు పెట్టాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్ కుమార్ గుప్తా, తెలంగాణకు చెందిన ఎన్ రామచంద్రన్ రఘురామ్.. ఇతర ప్రజల చిరుతలు దేశానికి తిరిగి రావడం పట్ల ఆనందంగా ఉన్నారని తెలిపారు.దీన్ దయాళ్ ఉపాధ్యాయ 106వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆధునిక, సామాజిక, రాజకీయ దృక్పథంతో భారతీయ తత్వశాస్త్రం ప్రపంచాన్ని ఎలా నడిపించగలదో దీన్ దయాల్ బోధించారని వివరించారు.

అలాగే ఆజాదీ కా అమృత మహొత్సవ్‌లో భాగంగా.. ఈ నెల 28వ తేదీన భగత్ సింగ్ జయంతి ఉత్సవం జరుపుకోబోతున్నాం అని తెలిపారు. భగత్ సింగ్ భారతమత బిడ్డ అని పేర్కొన్నారు. అలాగే చండీఘడ్ ఎయిర్ పోర్టుకు భగత్ సింగ్ పేరు పెడతామని తెలిపారు. అలాగే వాతావరణ మార్పు కూడా పెను ప్రభావం చూపుతుందని వివరించారు. అలాగే పండగ సమయంలో ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దని.. పర్యావరణ వినాశనం చేయొద్దని కోరారు. జ్యూట్, కాటన్, బానానా ఫైబర్.. మిగతా సాంప్రదాయ బ్యాగులు వాడాలని కోరారు.