Laya: ఒకప్పటి హీరోయిన్ లయ కూతురు ఫొటో వైరల్.. అందానికే అందం అనేలా..

గడిచిన పాతికేళ్ళ కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు స్టార్ హోదా దక్కిన సందర్భాలు చాలా తక్కువే. ఇక నార్త్ బ్యూటీలు ఎక్కువగా కొనసాగిన సమయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తెలుగు అమ్మాయిలలో లయ ఒకరు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన లయ వచ్చిన కొత్తలోనే మంచి నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు అందుకుంది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ కు ముగింపు కార్డు పెట్టిన లయ ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ తో తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే రీసెంట్ గా ఆమె కూతురికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

విజయవాడలో ఒక డాక్టర్ కుటుంబంలో జన్మించిన లయ ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ఆమె ఆటలలో కూడా చాలా హుషారుగా పాల్గొంటూ స్కూల్లోనే మంచి గుర్తింపును అందుకుందట. ఇక చెస్ గేమ్ లో కూడా ఆమె జాతీయస్థాయి పోటీలలో పాల్గొని అనంతరం హైదరాబాదులోని కొన్ని ప్రత్యేకమైన స్టేజ్ షోలలో క్లాసికల్ డాన్సర్ గా గుర్తింపు అందుకుంది.

దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట 1992లో భద్రం కొడుకో అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వేణు తొట్టెంపూడి తో చేసిన స్వయంవరం సినిమాతో మొదటి సక్సెస్ పొందింది. అనంతరం ఆమె మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగింది.

పెద్దగా గ్లామర్ డోస్ లేకుండా వీలైనంతవరకు హోమ్లీ పాత్రలోనే లయ తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుంది. మనసున్న మారాజు, కోదండరాముడు, దేవుళ్ళు హనుమాన్ జంక్షన్, ప్రేమించు సినిమాలతో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకుంది. కొండవీటి సింహం, శివరామరాజు, నువ్వు లేక నేను లేను అనే సినిమాలతో కూడా మంచి సక్సెస్ అందుకుంది.

2001 తర్వాత లయ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. అప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్స్ నార్త్ బ్యూటీలు స్టార్ హీరోలతో మీడియం రేంజ్ స్టార్స్ తో అవకాశాలకు అందుకుంటు ఉండగా లయ మాత్రం తనదైన శైలిలో కొన్ని డిఫరెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే ప్రతి సినిమాలో కూడా తన పాత్ర కొంత భిన్నంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంది.

ఇక 2005 వరకు చాలా బిజీగా కనిపించిన ఆమె 2006లో ఒక కన్నడ సినిమాలో నటించి ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు కాస్త దూరమైంది. అదే సమయంలో గణేష్ అనే ఎన్నారై ను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. అక్కడే ఫ్యామిలీతో స్థిరపడిన ఆమె ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. తరచుగా సోషల్ మీడియాలో ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా లయ షేర్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ గా లయ తన కూతురు శ్లోకకు సంబంధించిన ఒక ఫోటో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా లయ తన కూతురిని రెడీ చేసిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ లుక్ లో లయ కూతురు శ్లోక చాలా అందంగా ఉంది అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. లయ 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఇక మంచి పాత్రలు వస్తే మాత్రం నటించడానికి ఆసక్తిని చూపిస్తోంది.