Janaki Kalaganaledu Weekly Roundup: చిన్న కోడలి రాకతో కథలో ఊహించని మలువు.. జ్ఞానాంబ షాక్

టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 23, వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

రామచంద్ర పై జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. 20 ఏళ్ల నుంచి చూస్తున్న నీ సొంత తమ్ముడిని నువ్వు నమ్మలే వా అని అడుగుతుంది. భవిష్యత్తులో మన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని ఆలోచనతోనే ఆ విధంగా ఆలోచించాను అని రామచంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ జ్ఞానాంబ కోపం ఆగదు.

ఇక ఇదంతా జానకి వల్లే వచ్చింది అని ఆమె 5 తప్పులు చేస్తే ఏ మాత్రం క్షమించను అంటూ మొదటి తప్పును కొట్టేస్తున్నాను అని జ్ఞానాంబ చెబుతుంది. మరోసారి తప్పు జరిగితే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాను కూడా నాకు తెలియదు అంటూ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటానని అత్తగారు హెచ్చరిక ఇచ్చారు. దీంతో జానకి మళ్ళీ జెస్సి విషయంలో కన్ఫ్యూజన్లో పడుతుంది.

పూర్తి వివరాలు

ఇంట్లో అందరూ కూడా ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక మల్లిక మరొకవైపు ఇంకా జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు రాలేదు ఏంటి అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే జెస్సి తల్లిదండ్రుల ఇంట్లోకి వస్తారు. మేము బాధపడుతూ ఉంటే ఇక్కడ మీరు సంతోషంగా ఉన్నారా అని మీ అఖిల్ వల్ల నా కూతురు గర్భవతి అయింది అని పెళ్లి చేస్తారా లేదా అంటూ డైరెక్ట్ గా అడుగుతారు.

అయితే అందుకు జ్ఞానంబ మాత్రం నా కొడుకు తప్పు చేయలేదు అని గట్టిగా సమాధానం ఇస్తుంది. ఇక ఆఖరి సారి అడుగుతున్నాను అంటూ జెస్సి తల్లి దండ్రులు సీరియస్ గా చెప్పారు.

పూర్తి వివరాలు

ఇక గణేష్ నిమజ్జనం వేడుకలు జరుగుతున్న సమయంలోనే అప్పుడే కారులో నుంచి అఖిల్ జెస్సి పెళ్లి దండలతో కనిపిస్తారు. ఆ విషయాన్ని వెంటనే మల్లిక అత్తగారికి చెందుతుంది. ఇక వారిద్దరినీ అలా చూసిన జ్ఞానాంబ హారతి తీసుకురా అని పని మనిషికి చెబుతుంది. దీంతో ఆ మాటకు మల్లిక కూడా షాక్ అవుతుంది. వాళ్లని బయటకు పంపకుండా ఇంట్లోకి పంపుతున్నారు అని ఆచార్య పోతుంది. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మల్లిక కన్ఫ్యూజన్ లో ఉంటుంది.

అయితే గత రాత్రి జానకి అఖిల్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అఖిల్ తప్పు చేశాడు అనే విషయాన్ని జ్ఞానాంబ గ్రహిస్తుంది. ఆమె ఆలోచన ద్వారా అఖిల్ జెస్సి వివాహం జరుగుతుంది. ఇక జ్ఞానాంబ అఖిల్ పై చేయి చేసుకుంటుంది. నిన్ను నమ్మి జానకి రామచంద్రలను కూడా అనుమానించాని అని జ్ఞానాంబ అఖిల్ ను కొడుతుంది.

పూర్తి వివరాలు

ఇక మరోవైపు జెస్సి కూడా బాధపడుతుంది రామచంద్ర జానకి ఇద్దరు కూడా జెస్సికి ధైర్యం చెబుతారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని అంటారు. అయితే జెస్సి అఖిల్ మీద కూడా చాలా కోపంగా ఉంటుంది. నేను చాలా బాధలో ఉన్న సమయంలో అబార్షన్ చేయించుకోమని చెప్పావు. నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ నీ ప్రేమను పొందడానికి. కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇక్కడికి వచ్చాను. అలాగే మా కుటుంబ గౌరవం కోసం కూడా ఆలోచించాను.

ఇక నువ్వు కూడా నాతో మాట్లాడడానికి వీలులేదు.. అని జెస్సి సీరియస్ అవుతుంది. అయితే మరోవైపు జెస్సి తన ఇంట్లో ఉన్నట్లుగానే ప్యాంటు టీ షర్టు వేసుకొని అక్కడ ఉండడంతో జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఆచారాలు పద్ధతిలో ఉంటాయని వాటిని పాటించాలి అని జానకితో చెప్పించాలని జ్ఞానాంబ అంటుంది.

పూర్తి వివరాలు

తర్వాత జెస్సికి అర్థమయ్యే విధంగా జానకి చెబుతుంది. తాను కావాలని ఈ బట్టలు వేసుకోలేదని ఇంటి నుంచి కట్టు బట్టలతో వచ్చాను కాబట్టి ఉదయం లేవగానే అఖిల్ డ్రెస్ వేసుకున్నట్లు చెబుతుంది. ఇక జానకి తన దగ్గర ఉన్న చీరలు ఇస్తుంది. అనంతరం అందరూ భోజనం చేస్తూ ఉండగా జెస్సి తల్లిదండ్రులు కూడా వస్తారు ఆరోజు కోపంగా మాట్లాడిన దానికి క్షమాపణలు చెబుతున్నామని జరిగినవి మనసులో పెట్టుకోవద్దని అంటారు. అలానే మా ఆచారం ప్రకారం పెళ్లి అయిన తరువాత నాన్ వెజ్ తో విందు ఏర్పాటు చేస్తామని అంటారు.

నాన్ వెజ్ తినని జ్ఞానాంబ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ ఉండడంతో జెస్సి కూడా సహాయం చేయాలని అనుకుంటుంది కానీ అప్పుడే అక్కడ ఉన్న హారతి తగిలి ఒకరి చీర కాలుతుంది. మరి జెస్సి పొరపాటుకు ఆమె తల్లిదండ్రుల నాన్ వెజ్ విందు భోజనం కు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి

పూర్తి వివరాలు