Intinti Gruhalakshmi Weekly Roundup: తెరపైకి సామ్రాట్ భార్య.. తులసికి చిక్కులు.. కథలో ఊహించని మలుపు

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

19వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి, సామ్రాట్‌కు యాక్సిడెంట్ అయినట్లు కల రావడంతో నందూ టెన్షన్ పడతాడు. ఆ వెంటనే అభికి ఫోన్ చేసి తులసి గురించి ఎంక్వైరీ చేస్తాడు. అనంతరం తులసి కోసం సామ్రాట్ వస్తుండగా.. హనీ తనను స్కూల్‌ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. అలా వాళ్లిద్దరూ వెళ్తుండగా కారుకు ప్రమాదం జరుగుతుంది. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్చుతారు. ఆ విషయం తెలిసి నందూ, తులసి సహా అందరూ ఆస్పత్రికి చేరుతారు. అనంతరం హనీ పరిస్థితి తెలుసుకుని సామ్రాట్ విలవిలలాడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్ కారుకు యాక్సిడెంట్.. హనీ ఆరోగ్య పరిస్థితి తెలిసి షాక్

20వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. హనీ గురించి సామ్రాట్ పడుతున్న బాధను చూసిన నందూ.. తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే లాస్య వచ్చి నందూను నైట్ ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తుంది. అంతేకాదు, గ్రీజ్ అంటిన ప్యాంట్‌ను తీసుకొచ్చి అతడికి చూపించి.. సామ్రాట్ కారుకు బ్రేకులు తీసిన విషయాన్ని అడుగుతుంది. దీంతో అతడు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మెకానిక్ నోరు మూయించు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక, హనీ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి సామ్రాట్ తట్టుకోలేడు. అప్పుడే తులసి వాళ్లు హనీని తమ ఇంటికి తీసుకు రావాలని అనుకుంటారు.

21వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లక్కీ దీనంగా కూర్చుని ఉండగా.. నందూ, లాస్యలు లక్కీని తీసుకొస్తారు. అప్పుడు ఆ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటారు. తర్వాత లాస్య, హనీకి తినిపించాలని అనుకుంటుంది. అంతలో తులసి బాక్స్ పట్టుకుని వచ్చి హనీకి తినిపిస్తుంది. దీంతో నందూ, లాస్య వెళ్లిపోతారు. తర్వాత తులసి.. హనీని తీసుకెళ్తామని అనగా.. సామ్రాట్ వాళ్లనే తన ఇంటికి రమ్మని అడుగుతాడు. దీంతో ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అందరికీ చెబుతుంది. కానీ, అభి మాత్రం వద్దని అంటాడు. అయితే, ఇంట్లో వాళ్లు అందరూ సామ్రాట్ ఇంటికి వెళ్దామని అంటారు.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

22వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. హనీని చూసుకునేందుకు తులసి ఫ్యామిలీ మొత్తం సామ్రాట్ ఇంటికి వస్తుంది. ఆ వెంటనే తులసి వెళ్లి హనీని రెడీ చేసి తీసుకు వస్తుంది. అనంతరం అక్కడకు నందూ వస్తాడు. వచ్చీ రావడమే తులసితో అతడు గొడవ పడతాడు. తన ఫ్యామిలీని సామ్రాట్‌కు దూరం చేయమని డిమాండ్ చేస్తాడు. కానీ, తులసి మాత్రం అతడి మాటలను ఖాతరు చేయదు. తర్వాత అభి కూడా అంకితతో ఇదే విషయం గురించి మాట్లాడతాడు. అప్పుడు అంకిత కూడా అతడిని తప్పుబడుతుంది. అనంతరం అంతా సరదాగా ఉంటారు.

23వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ కంపెనీలోని జనరల్ మేనేజర్ రావు చేస్తున్న మోసాన్ని తులసి గుర్తిస్తుంది. దీంతో అతడు ఆమెకు ఈ విషయం సామ్రాట్‌కు చెప్తే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇస్తాడు. అయినప్పటికీ తులసి.. రావు మోసాన్ని సామ్రాట్‌కు తెలియజేస్తుంది. దీంతో అతడిపై సామ్రాట్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత తులసిని తన కంపెనీకి మేనేజర్‌ను చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. దీంతో అందరూ సంతోషపడతారు. కానీ, అభి మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. అప్పుడు పరందామయ్య.. తులసి తరపున దీనికి ఒప్పుకున్నానని చెప్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.