Godfather: మెగా వేడుకకు ముహూర్తం ఫిక్స్.. పవన్ కల్యాణ్ వస్తున్నాడా!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటించారు. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన ‘లూసీఫర్’కు ఇది రీమేక్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లను భాగం చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అలాగే, హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రావడంతో పలు రికార్డులు కూడా బ్రేక్ అయిపోయాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చిరంజీవి కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సందడి ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దీన్ని సెప్టెంబర్ 28వ తేదీన అనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌తో కూడిన ప్రకటనను వదిలింది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

ఇదిలా ఉండగా.. ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు చిత్ర యూనిట్ మాత్రం గెస్టు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అసలు ఈ వేడుకకు పవన్ వస్తాడా? రాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక, ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను చేస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.