Godfather మూవీతో చిరంజీవి అరుదైన రికార్డు: ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ టాలీవుడ్‌లో టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరిస్తోన్న ఆయన.. మధ్యలో రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్‌ను పూడ్చేందుకు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా: నరసింహా రెడ్డి’, ‘ఆచార్య’ వంటి భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ అనే మూవీతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి ఓ అరుదైన ఘనతను అందుకున్నారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. క్రేజీ కాంబోలో వస్తున్న దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం అందించాడు.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘లూసీఫర్’ మూవీకి ‘గాడ్ ఫాదర్’ రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఆ కథను మోహన్ రాజా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడు. అలాగే, ఇందులో చాలా పాత్రలను కూడా జత చేశాడు. హీరో పాత్రను కూడా మరింత ఎలివేట్ చేసి స్క్రిప్టును పూర్తిగా మార్చేశాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

రాజకీయ నేపథ్యం ఉన్న ఓ ఫ్యామిలీ పెద్ద, రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు కొడుకుకు అప్పగిస్తారు. అతడికి సమస్యలు వచ్చిన సమయంలో హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అసలు ఆ కుటుంబానికి, హీరోకు సంబంధం ఏంటి? హీరో పాత్రకు మాఫియా డాన్‌ ఎలా పరిచయం అనే అంశాలతో ‘గాడ్ ఫాదర్’ మూవీ రూపొందింది.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చిరంజీవి కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సందడి ప్రారంభం అయింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే దీన్ని ఇప్పుడు హిందీలో విడుదల చేస్తున్నారు. అలాగే, ఈ మూవీని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. వీటితో పాటు కన్నడ, తమిళంలోనూ వచ్చే ఛాన్స్ ఉంది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

వాస్తవానికి ‘గాడ్ ఫాదర్’ మూవీని మలయాళ చిత్రం ‘లూసీఫర్’ నుంచే రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని మళ్లీ అదే భాషలోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా ఏ స్టార్ హీరో సినిమా కూడా ఒరిజినల్ మూవీ భాషలోకి డబ్బింగ్ అవలేదు. ఫలితంగా ‘గాడ్ ఫాదర్’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లు అయింది.