Bigg Boss Telugu 6: సత్యను అక్కడ టచ్ చేసిన అర్జున్.. ఏకంగా అంత పని చేయడంతో షాక్

అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టు.. ఊహకే అందని టాస్కులు.. చిత్ర విచిత్రమై సంఘటనలు.. ప్రేమ కహానీలు.. రొమాన్స్‌ను పండించే సన్నివేశాలు ఇలా రకరకాల పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. అందుకే తెలుగులో ఇది ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సక్సెస్‌ఫుల్‌ అయింది. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్‌లో రికార్డులను సైతం క్రియేట్ చేసింది.

ఇంతటి విజయవంతమైన ఈ షో ఆరో సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే జనరంజకంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శ్రీ సత్యను అర్జున్ కల్యాణ్ టచ్ చేశాడు. దీంతో పెద్ద రగడే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా బిగ్ బాస్ షో తెలుగులో చాలా సీజన్లను క్రమం తప్పకుండా పూర్తి చేసుకోగలిగింది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, ఈ సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ దక్కడం లేదు.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షో సక్సెస్ అయిందంటే దానికి కారణం అందులో కనిపించే సన్నివేశాలే అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య కనిపించే లవ్ ట్రాకులు మరింత ఎలివేట్ అవుతుంటాయి. వీటికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఫలితంగా ఈ షో వల్ల ఎంతో మంది జంటలుగా మారి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయ్యారు.

బిగ్ బాస్ ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో మెరీనా అబ్రహం, రోహిత్ మాత్రం అధికారిక జంటగా వచ్చారు. మిగిలిన వాళ్లలో ఆర్జే సూర్య, ఆరోహి రావు ఒక జంటగా ఇప్పటికే ఫేమస్ అయ్యారు. అలాగే, అర్జున్ కల్యాణ్ – శ్రీ సత్య మధ్య కూడా ట్రాక్‌ మొదలైనట్లు కనిపిస్తుంది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సెలెబ్రిటీల్లో శ్రీ సత్య చాలా హైలైట్ అయింది. ఎంతో అందంగా ఉండే ఈ చిన్నదానికి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక, శ్రీ సత్యను పడేయడానికి అర్జున్ కల్యాణ్ తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్లాన్లు చేస్తున్నాడు. కానీ, ఆమె మాత్రం అతడిని అంతగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి.

శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో గత వారానికి వరస్ట్ పెర్ఫార్మర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ జరిగింది. ఇందులో మరో ఇద్దరితో కలిపి అర్జున్ కల్యాణ్‌కు సమానంగా ఓట్లు వచ్చాయి. కానీ, అతడే స్వయంగా జైలుకు వెళ్తానని చెప్పడంతో కెప్టెన్ అతడిని సెల్‌లో వేశాడు. దీంతో తాజా ఎపిసోడ్‌లో అర్జున్ కల్యాణ్‌ను అతడిని ఉంచిన రూమ్‌ పక్కనే శ్రీ సత్య కూర్చుని బాగా ఓదార్చింది.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

బిగ్ బాస్ జైలులో ఉన్న అర్జున్ కల్యాణ్‌తో శ్రీ సత్య మనసు విప్పి మాట్లాడింది. ఈ క్రమంలోనే తన కష్టసుఖాలను అతడితో పంచుకుని బాధ పడింది. ఆ సమయంలో అతడు ఆమెను ఓదార్చే క్రమంలో బాగంగా తన చేతి వేళ్లతో ఆమె మోచేతి దగ్గర నాలుగైదు సార్లు టచ్ చేశాడు (ఊరుకో అన్నట్లుగా). దీంతో శ్రీ సత్యకు ఒక్కసారిగా కోపం వచ్చి.. దీన్ని బాగా హైలైట్ చేసేసింది.

అర్జున్ కల్యాణ్ తనను టచ్ చేయడంపై శ్రీ సత్య ఓవర్‌గా రియాక్ట్ అయింది. అతడిని క్లాస్ పీకిన ఆమె.. ఆ తర్వాత రేవంత్‌తో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఓ పెద్ద సీన్ క్రియేట్ అయినట్లు అయింది. ఈ వ్యవహారంతో అర్జున్ కల్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడే కాదు.. ఇదంతా చూసిన ఆడియెన్స్ కూడా శ్రీ సత్య ఓవర్ చేసిందని కామెంట్లు కూడా చేస్తున్నారు.