Bigg Boss Telugu 6: రేవంత్ మెడలో గాడిద ట్యాగ్.. ఆమె కాటు వేసే పాము అంటూ హౌస్ లో కొత్త రచ్చ!

బిగ్ బాస్ హౌస్ మెంట్స్ కి ఎలాంటి జంతువులతో పోలుస్తారు అనే తరహా గేమ్ తో ఆదివారం ఎపిసోడ్ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టేబుల్ మీద కొన్ని జంతువుల పేర్లు ఉండగా ఎవరికి ఎలాంటి ఎనిమల్ పేరును డెడికేట్ చేస్తారు అని చెప్పిన నాగార్జున ఆ జంతువు పేరుని వాళ్ళ మెడలో వేయాలి అని అనంతరం అందుకు గల కారణం కూడా చెప్పాలని అనడంతో ప్రతి కంటెస్టెంట్ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమో వివరాల్లోకి వెళితే..

మొదట గీతూ ఊసరవెల్లి అనే ట్యాగ్ తీసుకుని నేహా మెడలో వేసేసింది. ఆమె పరిస్థితిని బట్టి ఒక్కసారిగా మారిపోతుంది అని చెప్పేసింది. అయితే అదే తరహాలో నేహా కూడా ఊసరవెల్లి ట్యాగ్ ను గీతూ మెడలో వేసేసింది. నాకే తెలుసు అని అనేస్తుంది. ఆ తర్వాత మళ్లీ రియలైజ్ అయ్యాను అంటూ మాట మారుస్తుందని నేహా చౌదరి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇక మరోవైపు చలాకీ చంటి గాడిద అనే ట్యాగ్ ను తీసుకెళ్లి సింగర్ రేవంత్ మెడలో వేసేశాడు. అతను గాడిదల అన్ని పనులు చేస్తుంటాడు కానీ దానిలో ఒక పద్ధతి ఉండదు అని కారణం చెప్పాడు. ఇక సింగర్ రేవంత్ పాము ట్యాగ్ తీసుకుని ఆరోహి మెడలో వేశాడు. నా మీదకి ఎవరైనా వస్తున్నారంటే మాత్రం నేను తప్పకుండా కాటేస్తాను అని ఆరోహి మరింత బలంగా కౌంటర్ ఇచ్చింది.

ఇక ఆర్జె సూర్య అయితే గీతూ రాయల్ ను సింహంతో పోలుస్తూ షాక్ ఇచ్చాడు. ఇక నాగార్జున కూడా ఈ సింహం ఆకలి వేసినప్పుడే కాదు ఎప్పుడు వేటాడుతూనే ఉంటుంది అని ప్రశంసలు కురిపించడం విశేషం. అలాగే ఫైమాను పిలవగానే ఏదో నాయనమ్మ అని పిలిచినట్లుగా ఉంది అనే నాగార్జునతో కామెడీ చేసింది. ఇకపై చంటిని సింహంతో పోల్చిన ఫైమా నామినేషన్ లో రెండు మూడు మాటలు చెప్పి పక్కకు వెళ్ళిపోయే సింహం అని వివరణ ఇచ్చింది.

👑 iamnagarjuna comes up with a fun game for the housemates!

Don’t miss this week’s Sunday Funday at 9 PM on StarMaa & DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/6CxZq6WYJo

ఇక ఆదిత్య అయితే ఆదిరెడ్డిని ఏనుగుతో పోలుస్తూ ఏనుగు ఎంత భారీగా ఉన్నా తన అడుగు మాత్రం తప్పు వేయదు అని.. ఎంత కంగారులో ఉన్నా కూడా ఆయన శృతిమించడు, శృతి తప్పడు అని కూడా ఆదిత్య ప్రశంసలు కురిపించాడు. ఇక శ్రీహాన్ ఊహించినట్లే ఇనయా ను పాము తో పోలుస్తూ పామును మనం ఎంత నమ్మిన ఎంత ప్రేమతో పెంచుకున్న ఏదో ఒక రోజు పెంచిన వాళ్ళని మింగేస్తుంది లేదా కాటేస్తుంది అని అన్నాడు.

అయితే ఈ ఆటలో కొందరికి ట్యాగ్లు వచ్చినాయి కొందరికి ట్యాగ్లే రాలేదు అని చెప్పిన నాగార్జున.. వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు కానీ రాని వాళ్ళు మాత్రం పూర్తిగా ఏమీ చేయడం లేదు అని నాగర్జున మరొక కౌంటర్ ఇచ్చాడు. ఇక చివరగా నామినేషన్స్ లో ఉన్నవారిలో ఈరోజు ఎవరు వెళ్లిపోతున్నారు అనే విషయాన్ని కూడా నాగార్జున తేల్చబోతున్నారు. నేహా ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం.