Bigg Boss Telugu 6: ఆమె చిరాకు తెప్పిస్తున్నా టాప్ లోనే.. నెంబర్ వన్ కు పోటీగానే?

బిగ్ బాస్ లో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో ఊహించడం కష్టంగానే ఉంటుంది. అంతేకాకుండా మొదట్లో నెంబర్ వన్ అనుకున్న వారు ఆ తర్వాత చాలా వేగంగానే హౌస్ లో నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఈసారి బిగ్ బాస్ లో ఫైవ్ కంటెస్టెంట్స్ గా ఎవరు నిలబడతారు అనేది ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. దాదాపు టాప్ 3 అనేది ఫిక్స్ అయింది. అయితే ఆ లిస్టులో ఉన్న ఒక అమ్మాయి ఒకరోజు నెగిటివ్ కామెంట్స్ అందుకుంటే మరొక రోజు వెంటనే ఓట్లతో మళ్ళీ టాప్ లోకి వస్తోంది. ఇది ఎలా సాధ్యం అనేది కూడా సోషల్ మీడియాలో వైరక్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైనప్పుడు భారీ స్థాయిలోనే రేటింగ్ అందుకుంటుంది.. అని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎంట్రీ తోనే ఎంతగానో ఆకట్టుకుంటారు అని కూడా కామెంట్స్ వినిపించాయి. కానీ ఈసారి బిగ్ బాస్ లోకి పెద్దగా పేరున్న ప్రముఖ సెలబ్రిటీలను తీసుకురాలేదు అని విమర్శలు కూడా వచ్చాయి. ఆ ప్రభావంతోనే ఈసారి ప్రారంభ ఎపిసోడ్ కు చాలా తక్కువ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి.

ఇక బిగ్ బాస్ లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో అందరికంటే ముందు స్థానంలో రేవంత్ కొనసాగుతున్నాడు అని చెప్పవచ్చు. అతను ఒక విధంగా అర్జున్ రెడ్డి తరహాలోనే కోపానికి గురి అవుతున్నప్పటికీ కూడా అనవసరంగా ఏమే మాట్లాడడం లేదు అని ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో స్పందిస్తున్నాడు అనే పాజిటివ్ గా ఓట్లు అయితే దక్కుతున్నాయి.

ఇక రేవంత్ తర్వాత అత్యధిక స్థాయిలో ఓట్లు అందుకుంటున్న కంటెస్టెంట్లలో శ్రీహాన్ అయితే రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. అతను మొదటి రెండు వారాలు కూడా పెద్దగా వివాదాలకు తావివ్వకుండా చాలా తెలివిగా అడుగులు వేశాడు. అయితే నాగార్జున క్లాస్ తీసుకున్న తర్వాత మాత్రం తనలోనే ఆవేశాన్ని బయటపడుతున్నాడు. ఇక అతను జనాల నుంచి మంచి ఆదరణ అందుకుంటూ ప్రస్తుతం టాప్ సెకండ్ కంటెస్టెంట్ గా అయితే నిలబడుతున్నాడు.

ఇక బిగ్ బాస్ లో టాప్ 5 లో ఉన్న వారిలో వివిధ రకాల పేర్లు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎక్కువగా టాప్ 3 కంటెస్టెంట్ గా గీతు రాయల్ కొనసాగుతున్నట్లు అర్థమవుతుంది. ఆమెకు గత రెండు వారాలుగా ఓట్లు అయితే అంతకంతకు పెరుగుతున్నాయి. మొదటి వారం అయితే అసలు ఆమెకు చాలా తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చాయి. కానీ ఈ వారం మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది.

ఒక విధంగా గీతూ రాయల్ మాట్లాడుతున్న మాటలకు హౌస్ మీట్స్ తో పాటు జనాలు కూడా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు కొన్ని విషయాల్లో స్పందించే విధానం ఏమాత్రం బాగోలేదు అని చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంది అని కూడా అంటున్నారు. తను చేస్తే మంచిది ఇతరులు చేస్తే తప్పు అనే భావనతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి.

అలాగే గీతు రాయల్ మాట్లాడుతున్న మాటలు కూడా కొంత అసభ్యకరంగా ఉన్నాయి అని కూడా చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె ఏదో ఒక విధంగా షోకు మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తోందని.. నిర్వాహకుల దృష్టిలో పడిందట. నెగటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా గీతు రాయల్ కెమెరాలన్నీటిని కూడా తనవైపు తిప్పుకుంటూ ఏదో ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేస్తోంది. ఇక గీతూ, రేవంత్ కు బలమైన పోటీ అని కూడా అని కామెంట్ చేస్తున్నారు మరి చివరి వరకు ఆమె టైటిల్ విన్నర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.