హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. అయితే, అందులో హీరోలే ఎక్కువగా ఉండగా.. హీరోయిన్లు మాత్రం చాలా అంటే చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చు. అందులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. అంతగా సక్సెస్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకుని మళ్లీ ఇప్పుడు నిర్మాతగా బిజీ అవుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే నిహారిక తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక ‘ఢీ’ అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా చేసింది. అందులో మెప్పించిన ఈ చిన్నది ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే బ్యానర్ స్థాపించి.. ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్న కూచీ’ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. దీంతో సినిమాల్లోకి రాకముందే ఫేమస్ అయింది.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

చాలా తక్కువ సమయంలోనే యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా నిహారిక సక్సెస్ అయిపోయింది. అయితే, హీరోయిన్‌గా మాత్రం ఆమెకు భారీ ఎదురుదెబ్బలే తగిలాయి. నాగశౌర్య నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని అందించలేదు.

హీరోయిన్‌గా వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న సమయంలో నిహారిక సినిమాలకు విరామం ప్రకటించింది. ఆ సమయంలోనే ఆమె చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్‌గా నటించకున్నా.. తన బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!
https://telugu.filmibeat.com/television/anchor-sreemukhi-stunning-pics-goes-viral-113258.html

ఆ మధ్య నిహారిక తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి సక్సెస్‌ను అందుకుంది. అలాగే, ఇటీవలే ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది. Z5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన దీనికి కూడా భారీ స్పందన దక్కింది. దీంతో ఇది తక్కువ టైంలోనే మంచి వ్యూస్‌ను సొంతం చేసుకుని హిట్ అయింది.

సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇలా తనదైన శైలిలో సందడి చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

NTR University: జగన్, రాజశేఖర్‌ రెడ్డిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆ జంతువులతో పోలుస్తూ ఘాటుగా!

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్నా.. నిహారిక కొణిదెల మాత్రం మిగిలిన హీరోయిన్లలా హాట్ షోకు దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే, భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి తీసుకున్న పిక్స్, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. ఇందులో కొన్ని రొమాంటిక్‌వి కూడా ఉంటున్నాయి. అయితే, ఈ మధ్య మాత్రం నిహారిక అప్పుడప్పుడూ హాట్ పిక్స్ వదులుతోంది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే మెగా డాటర్ నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది. ఫలితంగా ఆమె అందాలన్నీ చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. తొలిసారి ఇలాంటి హాట్ పిక్ వదలడంతో దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది తెగ వైరల్ అయిపోయింది.