వర్ష బీభత్సం: ఢిల్లీలో స్కూళ్లకు సెలవు, వరదతో తిప్పలు

ఈసారి దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగింది. పల్లెలు అయితే ఎలాగొలా తట్టుకోగలిగాయి. కానీ పట్టణాలు/ సిటీల్లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్దం. దేశ రాజధాని ఢిల్లీ గురించి అయితే చెప్పక్కర్లేదు. అక్కడ వరసగా మూడో రోజు వర్షం దంచి కొట్టింది. వర్షాల వల్ల తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.

వర్షాలే కాదు ఉరుములు, మెరుపుల ప్రభావం ఉండనుందట. సో దానికి అనుగుణంగా ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు. భారీ వర్షాల వల్ల ఢిల్లీ అంతటా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇప్పటికే చాలా కాల్స్ హెల్ప్ లైన్ నంబర్‌కు వస్తున్నాయి. వర్షానికి సంబంధించి, ట్లు పడిపోయిన అంశాలు ఉన్నాయి.

ఢిల్లీకి శనివారం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసిన సంగతి తెలిసిందే. వర్షాల వల్ల నోయిడా, గ్రేటర్ నోయిడాలో 8వ తరగతి వరకు పాఠశాలలను క్లోజ్ చేశారు. శుక్రవారం కూడా స్కూల్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. వర్షాల వల్ల స్కూల్స్ క్లోజ్ చేస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల తరగతి గదులు కూడా వర్షపునీటితో ఉంటున్నాయి.

నార్త్‌లో దీపావళి పెద్ద పండుగ అయినందున.. పండగ కోసం సెలవులను ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.