బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదు.. దబిడి దిబిడే.. రోజా షాకింగ్ కామెంట్

పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతున్న రోజా సెల్వమని రాజకీయాల్లో ఎలాంటి కౌంటర్లు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పటికే ఆమె చాలామంది ప్రముఖులపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక మరోసారి నందమూరి బాలకృష్ణ పై కూడా ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏకంగా సినిమా డైలాగ్ తోనే ఆమె ఇచ్చిన కౌంటర్ నందమూరి అభిమానులను కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రోజా ఏమని ట్వీట్ చేశారు అనే వివరాల్లోకి వెళితే..

రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైఎస్ఆర్ పేరును పెట్టగా అది ఒక్కసారిగా రాజకీయాల్లో కాంట్రవర్సీకి దారితీసింది. తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు చాలామంది ఈ నిర్ణయం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అలాగే నందమూరి హీరోలు కూడా స్పందించిన విషయం తెలిసింది.

జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ పేరు మార్చడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ అయితే కౌంటర్ ఇచ్చే విధంగా గట్టిగానే వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి వెన్నుముక అంటూ మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు అని ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతికి ఒక వెన్నుముక అని అన్నారు.

తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచ భూతాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.. అంటూ అక్కడ మహానీయుడు పెట్టిన బిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు అని అన్నారు. అలాగే విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి అని శునకాల ముందు తలవంచకు బతికే సిగ్గులేని బతుకులు.. అంటూ నందమూరి బాలయ్య బాబు సీరియస్ గా వివరణ ఇచ్చారు.

సినీ నటి, మంత్రి రోజా కూడా సోషల్ మీడియాలో స్పందించారు. బాలయ్య మాటలకు సమాధానం ఇస్తూ.. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే.. అంటూ రోజా చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది.

అయితే బాలకృష్ణ ఆ విధంగా వివరణ ఇవ్వడంతో వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఊహించని విధంగా స్పందించారు. ఇదివరకే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముందుగా నారా వారి చేతుల్లో ఉన్న నందమూరి పార్టీని మీ చేతిలోకి తీసుకోండి అని అనవసరంగా తొడలు కొట్టడం కాదు అని ముందు మీ పార్టీని తీసుకోవాలి అని కౌంటర్ ఇవ్వడం కూడా వైరల్ అయింది.