పిచ్చయ్యకు పిచ్చి పీక్స్.. గురువే ఇలా, విద్యార్థినిపై లైంగికదాడి, గర్భవతి కావడంతో

సమాజంలో టీచర్లకు మంచి గౌరవం ఉంది. కానీ కొందరు మాత్రం మారడం లేదు. తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు. వారు చేసే చేష్టలతో ఆ వృత్తికి కళంకం వస్తోంది. గురువులే లైంగికదాడి చేస్తోన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ తర్వాత ఎప్పటిలానే ఉంటున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో ఒక కీచకుడు అలా చేశాడు.

పరీక్లలో ఫెయిల్ చేస్తానని ఓ విద్యార్థినిని బెదిరించాడు. అలా తన కామవాంఛను తీర్చుకున్నాడు. పలుమార్లు లైంగికదాడి కూడా చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చటంతో.. ఆ ఉపాధ్యాయుడి కీచక పర్వం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఈ ఘటన వెలుగు చూసింది. దమ్మపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థినిపై మ్యాస్ టీచర్ పిచ్చయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు.

కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. భయపడ్డ బాలికను పలుమార్లు రేప్ చేశాడు. టీచర్ బెదిరించడంతో భయపడ్డ విద్యార్థిని విషయం ఎవరికీ చెప్పలేదు. అతడి అఘాయిత్యాలను మౌనంగా భరించింది. కొన్ని రోజుల తర్వాత విద్యార్థిని అనారోగ్యానికి గురైంది. ఆరోగ్యం బాలేదని ఇంటికి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.బాలికను పరీక్షించిన డాక్టర్.. గర్భవతి అని నిర్ధారించారు.దీంతో వారు షాక్ తిన్నారు.

కూతురుని నిలదీశారు. కీచక ఉపాధ్యాయుడి బాగోతాన్ని బయటపెట్టింది. విద్యార్థిని తల్లిదండ్రులు దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో టీచర్ పిచ్చయ్యపై ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మార్కులు తగ్గిస్తానని చెప్పి.. ఆ గురువు కామవాంఛ తీర్చుకున్నాడు. విద్యార్థిని ప్రెగ్నెంట్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఒక పిచ్చయ్యే కాదు.. కొందరు కూడా అలానే ఉన్నారు. కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని రావడం లేదు. సదరు టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే తమకేం కాదని రెచ్చిపోయే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ స్థానంలో ఉండి.. తమకేం కాదని కొందరు అనుకుంటున్నారు.