తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఆదివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే, కృష్ణకు కొద్దిపాటి శ్వాసకోశ సపోర్ట్‌ ఉందని ఆస్పత్రి తెలిపింది.

‘ఎస్ఎం కృష్ణ.. బెంగళూరు విమానాశ్రయం రోడ్ మణిపాల్ హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉంది’ అని మణిపాల్ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆయన కనీస శ్వాసకోశ మద్దతుతో, ఉల్లాసమైన మానసిక స్థితిలో ఉన్రుడు. ఆయన ఆరోగ్య స్థితిని ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ పర్యవేక్షిస్తున్నారు’ అని ఆస్పత్రి బులెటిన్ పేర్కొంది.

ఎస్ఎం కృష్ణ.. అక్టోబర్ 11, 1999 నుంచి మే 28, 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.