టికెట్లు మీరే ప్రకటించుకుంటారా – చంద్రబాబు సీరియస్ : ఆ మూడు నియోజకవర్గాలపై..!!

రానున్న ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా ముందస్తు కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లకు సీట్లు తిరిగి ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు ఇన్‌చార్జులకు చంద్రబాబు నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలు కీలకమని, ఏ మాత్రం అలక్ష్యం ప్రదర్శించినా ప్రత్యామ్యాయం వైపు చూడక తప్పదని పార్టీ నేతలకు తేల్చి చెబుతున్నారు. అందులో భాగంగానే కొందరు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు తమకు టికెట్ ఖరారైందంటూ చేసుకుంటున్న ప్రచారం పైనా ఆయన సీరియస్ అయ్యారు.

కొన్ని ప్రత్యేక మైన నియోజకవర్గాల విషయంలోనే అభ్యర్ధులను ఖరారు చేసారు. పలు జిల్లాల్లో ఎంపీ అభ్యర్దులు..ఎమ్మెల్యేలు అభ్యర్దుల పేర్లతో జరుగుతున్న ప్రచారం, దీని వెనుక ఉద్దేశాల పైన పార్టీ కార్యాలయం ఫోకస్ చేసింది. ఎవరెవరు ఈ రకంగా ప్రచారం చేసుకుంటున్నారనే దాని పైన ఆరా తీస్తోంది. చంద్రబాబు అధికారికంగా ప్రకటించే వరకూ ఎవరికీ సీటు ఖరారు అయినట్లు కాదని, ఇప్పటి వరకు ఇన్‌చార్జుల విషయంలో అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని చెబుతున్నారు.

వారి పనితీరు బాగుంటే వారికే టికెట్‌ వస్తుందని చెబుతున్న పార్టీ ముఖ్య నేతలు… బాగోకపోతే రాదు అంటూ కేంద్ర కార్యాకార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఇన్‌చార్జులతో జరుగుతున్న సమీక్షల్లో కఠినంగానే ఉంటున్నారు.

ఇంకా క్షేత్ర స్థాయిలో ఎన్నికల దిశగా సిద్దం కాని నేతల విషయంలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలతో ముందుకు వస్తారా, లేక ప్రత్యమ్నాయం చూసుకోమంటారా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా.. ఇద్దరు సిటింగ్‌ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం), ఆదిరెడ్డి భవాని (రాజమండ్రి నగరం), రాజాం ఇన్‌చార్జి కోండ్రు మురళితో విడివిడిగా భేటీ అయ్యారు.

ఇప్పటివరకు 59 మంది ఇన్‌చార్జులతో చంద్రబాబు సమీక్షలు పూర్తి చేసారు. ఈ సమీక్షల్లో చంద్రబాబు వివిధ మార్గాల నుంచి సేకరించిన క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా పలు సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో ఎక్కడ ఏ అంశంలో వెనుకబడి ఉన్నారనే దాని పైన క్లారిటీ ఇస్తున్నారు. ప్రధానంగా స్థానిక సమస్యలపైన స్పందిస్తున్న విధానం, పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఆరా తీస్తున్నారు.

కింది స్థాయిలో వర్గ విభేదాలు, స్ధానిక సమస్యలపై పోరాటాలు, ప్రత్యర్థి నేతల తప్పులను ఎత్తిచూపడం వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఎవరైతే సీరియస్ గా లారి విషయంలో పునరాలోచన లేదని స్ఫష్టం చేస్తున్నారు. పని తీరు టికెట్ ఖరారు చేయటానికి ప్రామాణికమని చంద్రబాబు వారితో తేల్చి చెప్పారు. గెలుస్తారనే నమ్మకం కలిగితేనే టికెట్ ఇస్తానని, లేకపోతే పునరాలోచన తప్పదని చంద్రబాబు ఖరాఖండిగా చెబుతున్నారు. అయితే, టికెట్లు ఎవరికి వారు తమకే వస్తుందంటూ చేసుకుంటున్న ప్రచారం పైన చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు.

దీంతో..ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, చిత్తూరు – కడప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు మినహా మిగిలిన సీట్లతో అధికారికంగా ఎక్కడా అభ్యర్ధులు ఖరారు కాలేదని పార్టీ వర్గాలు స్పస్టం చేస్తున్నాయి. దీంతో..ఇప్పుడు సమీక్షలు.. టికెట్ ఖరారు అంశంలో పార్టీ ఇన్‌చార్జుల్లో టెన్షన్ మొదలైంది.