గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు

     Bredcrumb

Published: Sunday, September 25, 2022, 15:00 [IST]  

భారతీయ వాహన రంగం రోజు రోజుకి చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే దేశంలో ప్రారంభమైన పండుగ సీజల్ లో అది మరింత ఎక్కువైంది. ఇందులో భగంగానే గత వారంలో కూడా కొన్ని కొత్త వాహనాలు మార్కెట్లో విడుదలయ్యాయి. ఇందులో టాటా పంచ్ క్యామో ఎడిషన్, వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ మొదలైనవి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో గత వారంలో విడుదలైన కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు  టాటా పంచ్ క్యామో ఎడిషన్:

భారతీయ మార్కెట్లో గత వారం విడుదలైన కొత్త కార్లలో టాటా మోటార్స్ యొక్క పంచ్ క్యామో ఎడిషన్ ఒకటి. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త క్యామో ఎడిషన్ ధరలు రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. టాటా పంచ్ కామో ఎడిషన్ అనేది కజిరంగా ఎడిషన్ తర్వాత విడుదలైన టాటా పంచ్ యొక్క రెండవ స్పెషల్ మోడల్.

 గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు

టాటా పంచ్ క్యామో ఎడిషన్ లో గమనించ దగ్గ విషయం దాని కలర్ ఆప్సన్. కావున ఇది కొత్త 'ఫోలేజ్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్' లో కనిపిస్తుంది. అయితే రూప్ మాత్రం పియానో ​​బ్లాక్ లేదా ప్రిస్టైన్ వైట్‌ కలర్ లో ఉంది.

గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు టాటా పంచ్ క్యామో ఎడిషన్ కేవలం అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇందులో 1.2-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 86 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్:

భారత మార్కెట్లో విడుదలైన కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్‌ ప్రారంభ ధర రూ. 43.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ఆధునిక SUV అద్భుతమైన డిజైన్, మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు వోల్వో ఎక్స్‌సి40 లో పెద్ద 2.0 లీటర్ పెట్రోల్ ఉంటుంది, ఈ ఇంజన్ 48V ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జనరేటర్ మోటార్‌తో కూడిన మైల్డ్ హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది. ఇది 197 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు ఆడి A4 (కొత్త కలర్):

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి (Audi) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ4 (Audi A4) సెడాన్‌ లో ఇప్పుడు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ తో పాటుగా కొత్త కలర్ ఆప్షన్లను కూడా పరిచయం చేసింది. కొత్త ఆడి ఏ4 (2022 Audi A4) లగ్జరీ సెడాన్ ఇప్పుడు ప్రీమియం, ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.43.12 (ఎక్స్-షోరూమ్) లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు కొత్త 2022 ఆడి ఏ4 ఇప్పుడు టాంగో రెడ్ మరియు మ్యాన్‌హాటన్ గ్రే కలర్ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కావున ఆడి ఏ4 టెక్నాలజీ వేరియంట్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు 19 స్పీకర్లతో కూడిన బి అండ్ ఓ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ను పొందుతుంది.

గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ ను మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది 7.3 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 241 కిలోమీటర్లు.

          English summary

Top car news of the week full details

Story first published: Sunday, September 25, 2022, 15:00 [IST]