కామన్ చార్జీ, రిజర్వేషన్ ఫెసిలిటీ.. ఏపీకి స్పెషల్ సర్వీసులు

దసరా ఫెస్టివ్ వచ్చేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో కొందరు షాపింగ్, మరికొందరు ఊర్లకు బయలుదేరుతున్నారు. అక్కడే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే కాక.. పొరుగు రాష్ట్రం అయిన ఏపీకి కూడా సర్వీసులు నడిపిస్తున్నారు. దళారులకు ఇదే సీజన్.. అందుకోసమే ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంది.

హైదరాబాద్ నుంచి ఏపీలోని తుని, కాకినాడ, విజయవాడకు సర్వీసులు.. అక్కడి నుంచి స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి తుని పరిసర ప్రాంతాల వారి కోసం తుని డిపో నుంచి ఏడు బస్సులు, హైదరాబాద్‌ నుంచి ఏలేశ్వరం ప్రాంతాలకు ఏలేశ్వరం డిపో నుంచి ఏడు బస్సులు, హైదరాబాద్‌ నుంచి కాకినాడ పరిసర ప్రాంతాలకు వచ్చేవారికి 15 బస్సులు, తిరుగు ప్రయాణానికి మరో 15 బస్సులు ఏర్పాటు చేశారు.

విజయవాడ దుర్గ గుడికి తుని నుంచి 20 బస్సులు, ఏలేశ్వరం నుంచి 15 బస్సులు, కాకినాడ నుంచి 30 బస్సు సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నుంచి కాకినాడ వచ్చేవారి కోసం, దసరా తర్వాత హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వెళ్లే వారి సౌకర్యార్థం కాకినాడ డిపో నుంచి స్పెషల్‌ బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యమైన దూరప్రాంత రూట్లలో స్పెషల్‌ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేశారు.

ఫెస్టివల్ అంటే ప్రైవేట్ దోపిడీ సహజం. ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుంటారు. అందుకోసమే ఆర్టీసీ పకడ్బందీగా బస్సులను నడిపిస్తోంది. స్పెషల్ బస్సులకు రిజర్వేషన్ సదుపాయం ఉంది. అలాగే ఎప్పటిలాగే మినిమం చార్జ్ వసూల్ చేస్తున్నారు.