ఉగ్రవాదుల కాల్పులు: కార్మికులపై ప్రతాపం, ఆస్పత్రికి తరలింపు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆడపా దడపా రెచ్చిపోతూనే ఉన్నారు. స్థానికులపై కాక స్థానికేతరులను కూడా వదలడం లేదు. ఇవాళ ఇద్దరిపై కాల్పులు జరిపారు. వారిని వెంటనే ఆస్పత్రికి పంపించడంతో ప్రాణపాయం తప్పింది. కాల్పులతో మరోసారి కశ్మీర్ ఉలిక్కిపడింది. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు.

పుల్వామాలో గల ఖార్బత్‌పుర వద్ద శనివారం ఉగ్రవాదులు ఫైర్ చేశారు. నాన్ లోకల్ కూలీలు శంషాద్, ఫైజాన్ ఖ్వార్సీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారిని వెంటనే సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నామని.. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు.

జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ ఉగ్రవాదుల దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు పాకిస్థాన్ కూడా చడీ చప్పుడు లేకుండా ఉంది. అంతకుముందు ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడేవి.