అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ లేదు: 12 ఏళ్ల బాలుడిపై లైంగికదాడి

సమాజం ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. దేశంలో మహిళలు, అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. నిర్భయ ఘటన తర్వాత యావత్ దేశం ఉలిక్కిపడింది. ఇప్పుడు దేశ రాజధానిలో 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. నలుగురు కలిసి దాడి చేసి.. లైంగికదాడి చేశారు. ఆ తర్వాత కర్రలతో కొట్టి.. అచేతన స్థితిలో వదిలి వెళ్లిపోయారు.

12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్ జరిగింది. నలుగురు కలిసి ఆ బాలుడిపై సామూహికంగా లైంగికదాడి చేశారు. ఆ తర్వాత బాధితుడిపై కర్రలతో దాడి చేసినట్టు తెలిసింది. అతడిని అలానే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఘటనపై ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చీఫ్ స్వాతి మాలివాల్ స్పందించారు.
ఢిల్లీ అబ్బాయిలకు కూడా సేఫ్ కాదని పేర్కొన్నారు.

ఇన్సిడెంట్ తాము టేకప్ చేశామని కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ వివరించారు. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఢిల్లీలో అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా సురక్షితంగా లేరు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపారు.

దీనిని బట్టి అబ్బాయిలను కూడా ఒంటరిగా పంపించే పరిస్థితి లేదు. ఇవాళ జరిగిన దానిని బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది. క్రైమ్ ఇలా కూడా జరుగుతుంది. రాను రాను.. టీనేజీ అబ్బాయిలు కూడా ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఢిల్లీలో నెలకొంది.