అధ్యక్షుడెవరైనా.. నిర్ణయాలు మాత్రం ?

అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ గెల‌వ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. నామినేష‌న్ల చివ‌రి తేదీ అయిన సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఎవరెవరు బరిలో ఉంటార‌నేది తేలిపోతుంది. అయితే తాను అధ్య‌క్షుడిగా ఎన్నికైతే రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా ఎవ‌రుంటార‌నే విష‌యాన్నిసోనియా నిర్ణ‌యిస్తార‌న్నారు. ఈ విష‌యంతో ఆయ‌న ఒక విష‌యాన్ని స్పష్టం చేశార‌ని భావిస్తున్నారు. అధ్య‌క్షుడు ఎవ‌రైనా నిర్ణ‌యం మాత్రం సోనియానే తీసుకుంటార‌న్నారు.

నెహ్రూ కుటుంబానికి సంబంధించిన పార్టీ అంటూ ప్ర‌తిప‌క్షాలు త‌రుచుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు విమ‌ర్శించేవి. గ‌డిచిన 20 సంవ‌త్స‌రా ల‌కాలంలో సోనియాగాంధీ అధ్య‌క్షురాలిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత రాహుల్ గాంధీ అధ్య‌క్షుడ‌య్యారు. గాంధీ కుటుంబేత‌ర వ్య‌క్తులు అధ్య‌క్షులుగా ఉండాల‌నే ఉద్దేశంతో వారు పోటీకి దూరంగా ఉన్నారు. అశోక్ గెహ్లాట్ చెప్పిన‌దానిపై ఇత‌ర పార్టీలు కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కీల‌క‌మైన నిర్ణ‌యాల‌న్నీ సోనియా తీసుకున్నార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తుంటారు. ఇప్పుడు గెహ్లాట్ చెప్ప‌డంతో కాంగ్రెస్ పార్టీ దొరికిపోయింద‌ని భావిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఒకేసారి రెండు పదవులు చేపట్టాలని భావించారు. కానీ రాహుల్ వ్యతిరేకించడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవడానికి అన్ని అవకాశాలు తలుపు తట్టాయి.