Tirumala వెంకన్న ఆస్తుల వెల్లడి – విలువ ఎన్నివేల కోట్లంటే…!!

ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తిరుమలి తిరుపతి దేవస్థానం ఆస్తుల వివరాలను ప్రకటించారు. టీటీడీ ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటుగా ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి ప్రసాదాల తయ్యారికి వినియోగించే పదార్దాలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. రూ 95 కోట్ల ఖర్చుతో అయిదో యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి పాలక మండలి ఆమోద ముద్ర వేసింది.

చెర్వోపల్లి నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ 30 కోట్ల ప్రతిపాదనలకు బోర్డు అంగీకరించింది. నందకం అతిధి గృహంలో పర్నిచర్ ఏర్పాటు కోసం రూ 2.45 కోట్లను మంజూరు చేసింది. యాత్రికుల కోసం కాటేజీల్లో గీజర్లు,పర్నిచర్ ఏర్పాటుకు వీలుగా రూ 7.2 కోట్ల నిధుల విడుదలకు బోర్డు అంగీకారం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి మొత్తంగా ఉన్న ఆస్తులు..వాటి విలువ వివరాలను బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు

టీటీడీకి సంబంధించి మొత్తంగా 960 ఆస్తులు ఉన్నాయని చెప్పారు. వాటి విలువ మొత్తం రూ 85,700 కోట్లుగా సుబ్బారెడ్డి ప్రకటించారు. క్లాస్ 4 ఉద్యోగుల యూనిఫామ్స్‌ కోసం రూ.2.5 కోట్లు కేటాయిస్తామన్నారు. వడమాలపేట దగ్గర భవిష్యత్‌ అవసరాల దృష్యా 130 ఎకరాలను రూ.25 కోట్లకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రూ 3 కోట్లతో నెల్లూరులో కళ్యాణమండపాల వద్ద ఆలయం నిర్మించాలని తీర్మానించిట్లు చెప్పుకొచ్చారు. రూ 6.3 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్వీ ఆర్ట్స్ కాలేజిలో అభివృద్ది పనులు చేపడతామన్నారు. బ్రహ్మోత్సవాలు తరువాత సర్వదర్శనం భక్తులుకు తిరుపతిలో టోకేన్లు జారి ప్రకియని తిరిగి ప్రారంభిస్తామని సబ్బారెడ్డి వెల్లడించారు.

సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు విఐపి బ్రేక్ దర్శనం టిక్కేట్లు కలిగిన భక్తులును ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వసతి గదులు కేటాయింపు ప్రకియను తిరుమలలో కాకూండా తిరుపతిలో కేటాయించాలని భావిస్తున్నట్లుగా సుబ్బారెడ్డి చెప్పారు. ఇక, ఈ నెల 25 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఏర్పాట్ల గురించి అధికారులు బోర్డు సమావేశంలో వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, సిఫార్సు దర్శనాలను రద్దు చేసారు. ఈ నెల 27వ తేదీన సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.