Techie: ప్రియురాలి కోసం కిల్లర్స్ తో భార్యను హత్య చేయించిన టెక్కీ, టీచర్ కోసం, పార్ట్ 2 !

ముంబాయి/థానే: ఒకే సిటీలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. దంపతులకు కుమార్తె ఉంది. దంపతులు ఇద్దరూ కార్పోరేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. సంతోషంగా సాగిపోతున్న దంపతుల జీవితంలో ఊహించని సంఘటన ఎదురైయ్యింది. కాలేజ్ మాజీ లవర్ భర్త జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. కాలేజ్ లవర్ కు పెళ్లి అయ్యి భర్త, పిల్లలు ఉన్నారు. ప్రియురాలు టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. రానురాను కాలేజ్ మాజీ లవర్స్ ఏకాంతంగా గడపడం, విహారయాత్రలకు వెళ్లడం మొదలుపెట్టారు. తన భర్త కాలేజ్ మాజీ ప్రియురాలితో తిరుగుతున్నాడని భార్యకు తెలిసిపోవడంతో గొడవలు మొదలైనాయి. టీచర్ ప్రియురాలు కోరిక మేరకు కిరాయి హంతకులతో భార్యను హత్య చేయించిన భర్త చేతులు దులుపుకోవాలని ప్రయత్నించాడు.

Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?

ముంబాయిలోని పన్వేల్ లో ప్రియాంక రావత్ అలియాస్ ప్రియాంక (30) అనే యువతి నివాసం ఉంటున్నది. ముంబాయిలోనే నివాసం ఉంటున్న దేవర్దన్ సింగ్ (33) అనే వ్యక్తితో ప్రియాంక వివాహం జరిగింది. ప్రియాంక, దేవర్దన్ సింగ్ దంపతులకు రెండు సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. దేవర్దన్ సింగ్, ప్రియాంక దంపతులు సంతోషంగా జీవించారు.

ముంబాయిలోని ఓ డిజిటల్ మార్కెటింగ్ కార్పోరేట్ కంపెనీలో ప్రియాంక మేనేజర్ గా ఉద్యోగం చేస్తోంది. ప్రియాంక భర్ద దేవర్దన్ సింగ్ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కార్పోరేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్న ప్రియాంక, దేవర్దన్ సింగ్ రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ పాపతో సంతోషంగా ఉంటున్నారు.

ఆరు నెలల క్రితం దేవర్దన్ సింగ్ కు ఫేస్ బుక్ లో తని కాలేజ్ మాజీ గర్ల్ ఫెండ్ నికిత (32) నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లింది. నికిత ఫోటో చూసి షాక్ అయిన దేవర్దన్ సింగ్ వెంటనే ఫేస్ బుక్ లో ఆమెకు టచ్ లోకి వెళ్లింది. కాలేజ్ లో చదివే సమయంలో దేవర్దన్ సింగ్, నికిత ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

నికిత, దేవర్దన్ పెళ్లి చేసుకోవడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు నిరాకరించారు, తరువాత నికిత వేరే వ్యక్తిని వివాహం చేసుకుని అతనితో కాపురం చేస్తోంది, నికితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేవర్దన్ ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం వరకు ఇద్దరూ టచ్ లో లేరు.

దేవర్దన్ సింగ్ ప్రియురాలు నికిత ముంబాయిలోనే టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. కాలేజ్ మాజీ లవర్స్ నికిత, దేవర్దన్ సింగ్ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకోవడం, ఏకాంతంగా గడపడం, విహారయాత్రలకు వెళ్లడం మొదలుపెట్టారు. గత నెలలో దేవర్దన్ సింగ్ మొబైల్ ఫోన్ చూసిన అతని భార్య ప్రియాంక భర్త అక్రమ సంబంధం విషయం గురించి తెలుసుకుంది.

తన భర్త దేవర్దన్ సింగ్ అతని కాలేజ్ మాజీ ప్రియురాలు నికితతో తిరుగుతున్నాడని ప్రియాంకకు తెలిసిపోవడంతో గొడవలు మొదలైనాయి. నేరుగా నికిత పని చేస్తున్న స్కూల్ దగ్గరకు వెళ్లిన ప్రియాంక పెద్ద గొడవ చేసింది. ప్రియాంక స్కూల్ లో తన పరువు తీసేసిందని, ఆమెను చంపేస్తే తన ప్రియుడు దేవర్దన్ సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందని నికిత ఆలోచించింది.

ప్రియాంకను హత్య చేయించడానికి ఆమె భర్త దేవర్దన్ కూడా ఓకే చెప్పాడు. కిరాయి హంతకులను రూ. 3 లక్షలు ఇచ్చిన టెక్కీ దేవర్దన్, లేడీ టీచర్ నికిత సాయంత్రం ఆఫీసు నుంచి వెళ్లిన ప్రియాంకను ఆమె ఇంట్లోనే హత్య చేయించారు. టీచర్ ప్రియురాలు నికిత కోరిక మేరకు కిరాయి హంతకులతో భార్య ప్రియాంకను హత్య చేయించిన టెక్కీ దేవర్దన్ సింగ్ చేతులు దులుపుకోవాలని ప్రయత్నించాడు. అయితే ప్రియాంక హత్య కేసులో ఆమె భర్త దేవర్దన్ సింగ్ తో పాటు అతని టీచర్ ప్రియురాలు నికితను పోలీసులు అరెస్టు చేశారు. టెక్కీ అతని టీచర్ ప్రియురాటు పార్ట్ టూ జీవితం జైల్లో గడపాల్సి ఉంది. కిరాయి హంతకులు చిక్కడం లేదని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.