NTR University: జగన్, రాజశేఖర్‌ రెడ్డిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆ జంతువులతో పోలుస్తూ ఘాటుగా!

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఎన్నో రచ్చలకు, వివాదాలకు కారణం అవుతున్నాయి. రాష్ట్రంలో నిత్యం ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య ఏదో ఒక ఇష్యూలో గొడవలు చెలరేగడం సర్వసాధారణం అయిపోయింది. దీంతో ఎప్పుడూ ఏదో ఒక అంశం హైలైట్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చారు. దీంతో అక్కడి రాజకీయాల్లో కలకలం రేగింది.

ఈ వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఇష్యూపై స్పందించారు. ఈ మేరకు ఓ పోస్టును చేశారు. ఇంతకీ అందులో ఏముంది? ఆయన ఎవరిని టార్గెట్ చేశారు? చూద్దాం పదండి!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హెల్త్ యూనివర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టారు. దీంతో ఈ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. అదే సమయంలో సినీ రంగంలో సైతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పేరును పెట్టడంపై ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మంది భగ్గుమంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

pic.twitter.com/z6ZgS0uZhR

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరును మార్చడంపై నందమూరి ఫ్యామిలీ కూడా వెనువెంటనే స్పందించింది. ఇప్పటికే ఆ కుటుండానికి చెందిన చాలా మంది ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

ఈ అంశంపై తారక్ ట్విట్టర్‌లో ‘ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదు. ఎన్టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తగ్గించలేరు’ అని పోస్ట్ చేశాడు. దీనిపై వ్యతిరేకత వ్యక్తం అయింది.

హెల్త్ యూనివర్శిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును తీసేయడంపై ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ కార్టూన్‌ను షేర్ చేసిన ఆయన.. ‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక’ అంటూ తనదైన శైలిలో పోస్ట్ చేశారు.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

నటసింహా నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన పోస్టులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు. ఆ ఫేస్‌బుక్‌ పోస్టులో ‘తండ్రి గద్దెనెక్కి ఆనాడు ఎయిర్‌పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి ఇప్పుడు యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.

ఇదే పోస్టులో బాలయ్య ‘అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’ అంటూ కొందరిపై పరోక్షంగా విమర్శలు చేశారు. మొత్తానికి బాలకృష్ణ ఘాటుగా చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.