Naga Chaitanya: తన 'లవ్ స్టోరీ'పై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్.. ట్వీట్ వైరల్

టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య కామ్ గోయింగ్ పర్సన్. మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులు తప్పుతే తన పని తాను చూసుకుంటూ పోయే హీరో. సినీ ఇండస్ట్రీలో సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీ వంటి విషయాలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, ప్రమోషన్లు, కెరీర్​ చూసుకోవడం తప్ప ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడు. ఇటీవల బాలీవుడ్ లో డెబ్యూగా చేసిన లాల్ సింగ్ చద్ధా, థ్యాంక్యూ మూవీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగ చైతన్య చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇటీవల విడుదలైన నాగ చైతన్య థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా నిలిచాయి. అయిన అదేం పట్టించుకోకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ అక్కినేని వారసుడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తాజాగా పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. నాగ చైతన్య కెరీర్ లో ఒక హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించి ఎంతోగానే అలరించింది. జంటగా.. నాగ చైతన్య, సాయి పల్లవి మెప్పించారు. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ మూవీ విడుదలై నేటితో ఏడాది గడిచింది.

Thank you so much to the entire team and audience for making this one special ! A film that taught me in so many ways .. memories I will always cherish https://t.co/gGWbzmZbT0

దీంతో తన లవ్ స్టోరీ చిత్రంపై ఎమోషనల్ గా స్పందించాడు నాగ చైతన్య. ఆ సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టాడు. ”ఈ సినిమాను నాకు ఎంతో స్పెషల్ చేసిన మొత్తం చిత్ర బృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాకు ఈ సినిమా ఎన్నో పాఠాలను నేర్పించింది. మధురానుభూతులు ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి” అని రాసుకొస్తూ లవ్ స్టోరీ మూవీ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేశాడు నాగ చైతన్య.

టాలీవుడ్​ మన్మథుడు నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. నాగచైతన్య 2009లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి.

తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య. ఇందులో ముద్దు సీన్లు, నటనతో యూత్​ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు.

అనంతరం క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో మిల్క్​ బ్యూటీ తమన్నాతో నాగ చైతన్య జోడి కట్టిన చిత్రం 100% లవ్. ఈ సినిమా కూడా బ్లాక్​ బస్టర్ హిట్​ అయింది. దీంతో చైతూ లవర్ బాయ్​గా ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ భారీ విజయాల తర్వాత వచ్చిన దడ, బెజవాడ, అటో నగర్​ సూర్య, తడఖా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.