Intinti Gruhalakshmi Today Episode: తులసి పొరపాటు చేసేలా ప్లాన్.. మీడియా వాళ్లతో లాస్య కుమ్మక్కు

ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటింటి గృహలక్ష్మి’ శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ కంపెనీలోని జనరల్ మేనేజర్ రావు చేస్తున్న మోసాన్ని తులసి గుర్తిస్తుంది. దీంతో అతడు ఆమెకు ఈ విషయం సామ్రాట్‌కు చెప్తే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇస్తాడు. అయినప్పటికీ తులసి.. రావు మోసాన్ని సామ్రాట్‌కు తెలియజేస్తుంది. దీంతో అతడిపై సామ్రాట్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత తులసిని తన కంపెనీకి మేనేజర్‌ను చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. దీంతో అందరూ సంతోషపడతారు. కానీ, అభి మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. అప్పుడు పరందామయ్య.. తులసి తరపున దీనికి ఒప్పుకున్నానని చెప్తాడు.

NTR University: జగన్, రాజశేఖర్‌ రెడ్డిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆ జంతువులతో పోలుస్తూ ఘాటుగా!

తులసికి జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత నందూ, లాస్య మాట్లాడుకుంటుంటారు. తులసికి పోస్ట్ ఇవ్వడంతో నందూ జాబ్ మానేసి వెళ్లిపోదాం అంటాడు. దీంతో లాస్య ‘మనకు ఇప్పుడు బయటికెళ్లి వేరే జాబ్ చేస్తే స్థితి ఉందా? మనం బయట గడ్డిపోచ కిందికి కూడా పనికిరాం. వాళ్లకు గులాంగిరీ కొట్టాల్సిందే. అందుకే మనకు తులసి చదువే ప్లస్ పాయింట్. తను ఏమాత్రం చదువుకోలేదు కాబట్టి తన వెంటే ఉండి తనకు సపోర్ట్ ఇచ్చినట్టుగా నటించి తను తప్పు చేసేలా చేద్దాం. అప్పుడు సామ్రాట్ తనను ఇంటికి పంపించేస్తాడు’ అని నందూతో చెబుతుంది.

ఇక, తులసి జనరల్ మేనేజర్ అయిన తర్వాత ప్రేమ్, అంకిత, శృతిలు అభితో మాట్లాడతారు. అప్పుడు ప్రేమ్ ‘తనకు ఇష్టం ఉండో లేకనో మామ్‌కు ఓ బాధ్యత వచ్చింది. తనకు ఇష్టం లేకున్నా ప్రెజర్ చేయడం వల్ల దీనికి ఒప్పుకుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది. అమ్మను తన పని చేసుకోనిద్దాం’ అంటాడు. దీంతో అభి ‘తను నాకూ అమ్మే.. నాకూ అమ్మ మీద ప్రేమ ఉంది. తన ప్రేమ మీద నాకూ అంతే హక్కు ఉంది. కానీ, మీరు అమ్మ గురించే ఆలోచిస్తున్నారు. నేను ఏమని అనుకుంటున్నానో మీకు అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

ఆ తర్వాత సామ్రాట్ ఇంట్లో ఉన్న తులసి.. లక్కీ, హనీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. దీంతో ఆ ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇంతలో అభి, ప్రేమ్ కూడా అక్కడికి వచ్చి మాకు తినిపించు అమ్మా అంటారు. దీంతో హనీ మీరేమైనా చిన్నపిల్లలా అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ అవును.. చిన్నపిల్లలమే. మా అమ్మకు ఎప్పుడూ మేము చిన్నోళ్లమే అని అంటాడు. ఆ తర్వాత అందరికీ తులసి అన్నం తినిపిస్తుంది. అదంతా చూసిన సామ్రాట్.. తెగ సంతోషిస్తుంటాడు. తన ఇంట్లో అందరూ అలా కలిసి ఉండడం చూసిన అతడు.. ఆనంద పడుతుంటాడు.

ఇంట్లో అందరూ సంతోషంగా గడుపుతూ ఉండగానే హనీని పరీక్షించేందుకు డాక్టర్ అక్కడకు వస్తుంది. ఆ చిన్నారి చేతిని చూసిన డాక్టర్ నయం అయిపోయిందని చెప్తుంది. అంతేకాదు, ఆ చేతికి ఉన్న కట్టును కూడా విప్పేస్తుంది. దీంతో హనీతో పాటు అక్కడున్న వాళ్లందరూ సంతోషిస్తారు. అప్పుడు హనీ ఇక నేను ఏ ఆట ఆడటానికి అయినా రెడీ అంటుంది. దీంతో తులసి కూడాఇంకేంటి నువ్వు ఇక ఏ గేమ్ అయినా ఆడొచ్చు అంటుంది. అప్పుడు హనీ ‘నేను బాగు అయితే మీరు అందరూ వెళ్లిపోతారు కదా. నేను ఎవరితో ఆడాలి’ అని అంటుంది. దీంతో తులిసి షాక్ అవుతుంది.

ఆ తర్వాత సామ్రాట్ మిస్టర్ నందు.. వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి అని అంటాడు. దీంతో తులసి ‘మళ్లీ మ్యూజిక్ స్కూల్ పనులు ప్రారంభిస్తే అయిపోతుంది కదా. దానికి మళ్లీ ప్రెస్‌మీట్ ఎందుకు’ అని అంటుంది. దీనికి నందూ ఒప్పుకుంటాడు. కానీ.. లాస్య మాత్రం ‘ఎందుకు నందూ.. సామ్రాట్ గారు ఇమేజ్ ఉన్న వ్యక్తి. పబ్లిక్ క్లారిటీ కోరుకుంటోంది కదా’ అని చెబుతుంది. అప్పుడు పరందామయ్య ‘ఆ ప్రెస్‌మీట్ కంటే ముందు తులసి మెసేజ్‌ను లీక్ చేసింది ఎవరు?‌ తులసి పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా చేసిందెవరో కనుక్కోండి’ అంటాడు.

పరందామయ్య అన్న దానికి తులసి ఒప్పుకోదు. పైగా ‘ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకొని ఏం చేస్తారు. దారిలో ముళ్లు గుచ్చకుంటే నా దారిన నేను వెళ్తాను తప్పితే ముళ్లును కాల్చి బూడిద చేయాలని అనుకోను. దాని వల్ల నా సమయమే వేస్ట్ అవుతుంది. కాకపోతే మరింత జాగ్రత్త పడతాను. మరోసారి ముల్లు గుచ్చుకోకుండా ఉంటాను’ అంటుంది. దీంతో సామ్రాట్ శెభాష్.. మీ థియరీ నాకు బాగా నచ్చింది. నా వరకు ప్రెస్‌మీట్ అవసరమే అనిపిస్తోంది అంటాడు. మరోవైపు ప్రెస్‌మీట్‌లో ఇక వాళ్లు రెచ్చిపోతారు చూడు అంటూ లాస్య నందూతో అంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం వచ్చిన మీడియా వాళ్లకు లాస్య ఏదో ప్లాన్ చెబుతుంది. నేను చెప్పిన ప్రశ్నలు అడగాలని చెబుతుంది. దీంతో వాళ్లు ఓకే అంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.