Guppedantha Manasu: వసుని చూసి సిగ్గుతో దాక్కున్న రిషి.. మంచిపని చేశాడనుకున్న దేవయాని

వంట గదిలో వెనక వచ్చిన రిషిన చూడకుండా గల గల మాట్లాడేస్తుంది వసుధార. వచ్చింది జగతి మేడమ్ అనుకుని.. ఏంటీ మేడం.. మీరు కొంచెం కూరలు తరగండి అంటుంది. ఈ మాట విన్న రిషి ఏం మాట్లాడకుండా కూరగాయలు కట్ చేస్తుంటాడు. రిషి సార్ కూడా మీలాగే మేడం.. ఆల్ రౌండర్. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. నాలాంటి వ్యక్తి దొరకడం రిషి సార్ అదృష్టం కదా మేడం అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది వసుధార. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోంది లవ్ స్టోరీ సీరియల్ గుప్పెడంత మనసు. అయితే సెప్టెంబర్​ 24, 2022 శుక్రవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్​ తాజా ఎపిసోడ్​ 563 ప్రోమోలో ఏం జరిగిందో చదివేసేయండి.

కూరగాయలు కట్ చేస్తున్న రిషిని వెనక్కి తిరిగి చూసిన వసుధార షాక్ అవుతుంది. అక్కడ అలాగే నిలబడి పోతుంది వసుధార. తర్వాత కూరగాయలు కట్ చేసిన రిషి.. జ్యూస్ చేసివసుధారకు ఇస్తాడు. తనకు వద్దు సార్ అని వసుధార అంటే తీసుకో అని రిషి అంటాడు. ఇద్దరూ అటు ఇటూ తోయడంతో చివరిగా ఆ జ్యూస్ గ్లాస్ రిషి డ్రెస్ పై పడుతుంది. కంగారు పడిన వసుధార తుడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని ఫైర్ అవుతుంది.

ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే జ్యూస్ పడిన డ్రెస్ ను మార్చుకునేందుకు తన గదిలోకి వెళతాడు రిషి. ఇదంతా తనవల్లే జరిగిందని బాధపడుతూ తెలియకుండానే రిషి రూమ్ లోకి వెళుతుంది వసుధార. డ్రెస్ మార్చుకునేందుకని టవల్ లో ఉంటాడు రిషి. ఇక వసుధార తన గదిలోకి రావడం చూసిన రిషి సిగ్గుతో కప్ బోర్డ్ లోపల దాక్కుంటాడు. దీంతో సారీ సార్ అని వసుధార అంటుంది. వచ్చేముందు చూసుకోవాలిగా అని రిషి అంటాడు. జ్యూస్ మీ మీద పోశాను కదా సార్.. ఆ టెన్షన్ లో మర్చిపోయాను అని వసుధార అనగానే.. ఇప్పుడేంటీ వెళ్లు అంటాడు రిషి.

అక్కడి నుంచి వెళుతూ జ్యూస్ పడిన రిషి డ్రెస్ ను తీసుకుంటుంది. అదెందుకు అని రిషి ప్రశ్నించగా.. నేనే క్లీన్ చేసి ఇస్తాను వసుధార సమాధానం చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. రిషిధారల ప్రేమ కహానీ ఎలా వెళ్తుంది అనే తదితర ఆసక్తికర విషయాలను ఇవాళ అంటే సెప్టెంబర్ 24 శనివారం ప్రసారమయ్యే 563 ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇక శుక్రవారం ప్రసారమైన 562 ఎపిసోడ్ లో ఒక విషయం చెప్పాలి పెద్దమ్మ.. ఎలా చెప్పాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనగానే ఏమైంది నాన్నా చెప్పు అని దేవయాని అంటుంది. ఆమెను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. కోపం వస్తుంది అని అంటాడు రిషి.

సాక్షి చేసే పనులు చూస్తే కోపం వస్తోంది పెద్దమ్మ అని రిషి అనగానే.. సాక్షి పేరు విన్న దేవయాని షాక్ అవుతుంది. అసలు వసుధారను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసా ఈ సాక్షి.. సీసీ టీవీ ఫుటేజ్ లో సాక్షి చేసిన పనంతా చూశాను, తను ఇంత నీచానికి దిగజారింది.. తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మీరే తనను అసలు ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పండి లేదంటే కోపంలో ఏం చేస్తానో తెలియదని చెప్పి రిషి వెళ్లిపోతాడు. రిషి వెళ్లిన తర్వాత ఆలోచనలో పడిన దేవయాని.. ఈ విషయం తనకు చెప్పి మంచి పని చేశాడు నేరుగా సాక్షిని నిలదీసి ఉంటే మొత్తం బయటపడేదని అనుకుంటుంది దేవయాని.

Guppedantha Manasu – Promo | 24th Sep 2022 | #StarMaaSerials #GuppedanthaManasu Mon to Sat at 7.00 pm #StarMaa. pic.twitter.com/z4oCCJMTeP

అనంతరం వంట గదిలోకి వెళ్లిన రిషి.. నన్ను నన్నులా ఉండనీయమని మీ స్టూడెంట్ కు చెప్పండి అని ఇన్ డైరెక్ట్ గా గురు దక్షిణ ఒప్పందం గురించి జగతితో మాట్లాడతాడు. తర్వాత వెళ్లిపోతాడు రిషి. ఇక్కడ కట్ చేస్తే వంట గదిలో వసుధార జగతి మాట్లాడుకుంటారు. ఇంతలో రిషి వచ్చి జగతిని చూసి వెనక్కి వెళ్లిపోతాడు. అది గమనించిన జగతి ఇప్పుడే నేను వస్తాను వసుధార అనేసి వెళ్లిపోతుంది. జగతి విషయం గమనించని వసుధార గలగల మాట్లాడేస్తుంది. రిషి సార్ కూడా మీలాగే మల్టీ టాలెంటెడ్. అన్ని పనులు వచ్చు. కానీ కొపం ఎక్కువ. నేను రిషి సార్ కు దొరకడం లక్కీ కదా.. అయినా మీరు ఒప్పుకోరు లేండి.. నేనే లక్కీ అంటారు అంతే కదా.. ఏంటీ మేడమ్ ఏం మాట్లాడటం లేదు అని వెనక్కి తిరిగి రిషిని చూసిన వసుధార షాక్ అయి చేతిలో ఉన్న గరిట కింద పడేస్తుంది.