GodFather: ఆకాశంలో మెగాస్టార్ తో శ్రీముఖి ఇంటర్వ్యూ.. హాట్ గా అన్నారని అంటూ..

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ డోస్ పెంచారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంటర్వ్యూలను చాలా డిఫరెంట్ స్టైల్ లో మొదలుపెట్టేశారు. ఇక రీసెంట్ గా ఆయన ఏకంగా ఆకాశంలో శ్రీముఖితో ఇంటర్వ్యూ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందులో ఆయన ఎలాంటి విషయాలు చెప్పారు.. అనే వివరాల్లోకి వెళితే..

ప్రత్యేకంగా తన పర్సనల్ విమానంలో ప్రయాణం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఆ ఇంటర్వ్యూలో శ్రీముఖి యాంకర్ గా కనిపించి మెగాస్టార్ ను చూసి ఆనందంలో సినిమా గురించి ఎన్నో విషయాలను గురించి అడిగింది. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా నిశ్శబ్ద విస్ఫోటనం అనే తెలియజేశారు.

హీరోయిన్ అలాగే సినిమాలో ఎలాంటి పాటలు లేకపోయినా కూడా అలాంటి ఆలోచన రాకుండా చేసే పర్ఫెక్ట్ సబ్జెక్టు గాడ్ ఫాదర్ అంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమతో ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నారు అని అందుకు ఆయనకు ప్రత్యేకంగా హాట్సాఫ్ చెప్పాలని కూడా అన్నారు.

ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో పూరి జగన్నాథ్ కనిపించగా మొదట అతను ఈ పాత్ర నేను చేయలేను అని అన్నాడు. కానీ అతనే ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని అందరము డిసైడ్ అయ్యాము అని తెలియజేశారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత పూరి జగన్నాథ్ లో కూడా ఒక మంచి నటుడు ఉన్నాడు అని మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చిరు అన్నారు.

ఇక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మాట్లాడుతూ సినిమాలో మ్యూజిక్ తో సినిమాకు మరో ప్రాణంలా నిలిచాడు థమన్ అంటూ అతను 100% ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు అని అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ సినిమా చూశాక అందరు మెచ్చుకుంటారు అని కూడా అన్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.

ఇక శ్రీముఖి మాత్రం ప్రత్యేకంగా మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ చూసి ఈ లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారని కూడా చెప్పడంతో మెగాస్టార్ కాస్త సిగ్గు పడిపోయారు. అలాగే తార్ మార్ సాంగ్ లో కూడా మీరు వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయని చెప్పిన శ్రీముఖి నవ్వుతూ సరదాగా పంచులు కూడా వేసింది. ఇక ఇంటర్వ్యూ ప్రోమో ఇలా ఉంది అంటే ఇంకా ఫుల్ ఇంటర్వ్యూ లో మెగాస్టార్ ఇంకా ఏ స్థాయిలో చెప్పి ఉంటారో అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్లో పాజిటివ్గా స్పందిస్తున్నారు.