Bigg Boss Telugu 6: ముద్దు పెట్టనా? ఇంతసేపు పెట్టావు కదా.. వామ్మో షోలో మరో జంట రచ్చ

తెలుగు బుల్లితెరపై వచ్చే షోలు అన్నింటి కంటే ఎక్కువ రేటింగ్‌ను రాబడుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా రికార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఆరో సీజన్ కూడా అదే రీతిలో రెస్పాన్స్‌ను రాబడుతోంది. దీంతో ఇది కూడా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఇక, ఇందులో ఓ జంట బాగా హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వాళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. ముద్దు పెట్టనా అంటూ నిర్మొహమాటంగా మాట్లాడుకున్నారు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

తెలుగులో బిగ్ బాస్ షో కంటే దేనికీ ఎక్కువ రేటింగ్ రావడం లేదన్న విషయం తెలిసిందే. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడిపిస్తున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. కానీ, దీనికి ఆశించిన రీతిలో రేటింగ్ మాత్రం దక్కడం లేదు.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

బిగ్ బాస్ షోలో గొడవల తర్వాత ఎక్కువగా హైలైట్ అయ్యేది కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే లవ్ ట్రాకులే అని చెప్పుకోవచ్చు. వాళ్ల మధ్య లవ్ ఉన్న లేకున్నా.. నిర్వహకులు మాత్రం జోడీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంటనైనా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ షో వల్ల ఎంతో మంది జంటలుగా ఫేమస్ అయిపోయారు.

బిగ్ బాస్ షోలో లవ్ ట్రాకులు ఎంతో హైలైట్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫిక్షనల్ కాకుండా రియల్ ఇన్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయి కాబట్టి లవ్ స్టోరీలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లో మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీ అనే నిజమైన జంటను హౌస్‌లోకి పంపారు. అలాగే, మరికొందరిని జంటలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

బిగ్ బాస్ షో ప్రతి సీజన్‌లోనూ ప్రేమకథలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆరో సీజన్‌లోనూ పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలకు రొమాంటిక్ టాస్కులు ఇచ్చి రచ్చ చేస్తున్నారు. అయితే, ఒక ఇద్దరు మాత్రం ఆరంభం నుంచే జంటగా సందడి చేస్తున్నారు. వాళ్లెవరో కాదు.. ఆర్జే సూర్య, ఆరోహి రావు. బయటే క్లోజ్ ఫ్రెండ్ కావడంతో హౌస్‌లోనూ వీళ్లిద్దరూ జోడీగా హడావిడి చేస్తున్నారు.

ఆర్జే సూర్య, ఆరోహి రావులు దాదాపు మూడేళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ హౌస్‌లో కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే, వీళ్లు ఫ్రెండ్స్‌కు తక్కువ, లవర్స్‌కు ఎక్కువలా ప్రవర్తిస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ హగ్గులు ఇచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. అలగడం.. బ్రతిమాలడం వంటివి చేస్తూ ఫోకస్ అవుతున్నారు.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆర్జే సూర్య, ఆరోహి రావు వ్యవహరించిన తీరు మరింత హాట్ టాపిక్ అవుతోంది. గత ఎపిసోడ్‌లో ఓ సందర్భంలో ఆమెను అతడు అరిచేశాడు. దీంతో ఈ చిన్నది అలిగి బుంగమూతి పెట్టుకుంది. దీంతో సూర్య సోఫాపై కూర్చుని ఆమెను తెగ బ్రతిమలాడేశాడు. అందుకు అనుగుణంగానే ఆరోహి కూడా మూతి ముడుచుకుని తన డిమాండ్లను వినిపించింది.

ఎంత బ్రతిమలాడినా వినకపోవడంతో ఆర్జే సూర్య.. ఆరోహి రావుతో ‘ముద్దు పెట్టనా’ అని అన్నాడు. దీనికామె ‘ఇంతసేపు పెడుతూనే ఉన్నావు కదా’ అని బదులిచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ జంట బాగా హైలైట్ అవుతోంది.