Bigg Boss Telugu 6: ఆమెతో అలాంటి పనులు.. నాతో ఎవరూ చేయట్లేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ షో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో వచ్చే షో మాత్రం మిగిలిన భాషలు అన్నింటి కంటే ఎక్కువగా ఆదరణను దక్కించుకోవడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదింటిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

తెలుగులో బిగ్ బాస్‌కు దక్కేంత ఆదరణ మరే షోకూ రావడం లేదు. గతంలో వచ్చిన అన్ని సీజన్లు సూపర్ హిట్ అవడానికి కారణం ఇదే. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఆరో సీజన్‌లో సరికొత్త టాస్కులు, రొమాన్స్, లవ్, ఎమోషన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో షోను రంజుగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఎందుకనో దీనికి అంతగా రేటింగ్ దక్కడం లేదు.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

గతంలో వచ్చిన సీజన్ల కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో తెలుగు హీరోయిన్ వాసంతి కృష్ణన్ బాగా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు.

వాసంతి కృష్ణన్ తెలుగులో సుదీర్ఘ కాలంగా తనదైన యాక్టింగ్‌తో అలరిస్తోంది. ‘సిరిసిరి మువ్వలు’ అనే సీరియల్ ద్వారా పరిచయం అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత ‘గోరింటాకు’, ‘గుప్పెడంత మనసు’ సహా ఎన్నో సీరియళ్లలో నటించింది. అలాగే కొన్ని చిత్రాల్లోనూ ఈ అమ్మడు సందడి చేసింది. ఇక, సంపూర్ణేష్ బాబు ‘క్యాలీ ఫ్లవర్’ మూవీలో హీరోయిన్‌గా చేసింది.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై, వెండితెరపై తెగ సందడి చేస్తున్నా.. వాసంతి కృష్ణన్ మాత్రం పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేదు. దీంతో ఆమెకు పెద్దగా క్రేజ్ కూడా దక్కలేదు. అలాగే, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆమె మాత్రం అస్సలు హైలైట్ అవడం లేదు. మొదట్లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఆటను మొదలుపెట్టమని కూడా అడిగిన విషయం తెలిసిందే.

మూడో వారానికి జరిగిన నామినేషన్స్‌లో వాసంతి కృష్ణన్ నామినేట్ అయింది. దీంతో ఎలిమినేషన్ టెన్షన్ ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో ఈ బ్యూటీ తానే ఎలిమినేట్ కాబోతున్నట్లు మాట్లాడింది. ‘ఇనయా, ఆరోహి, నేను ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నాం. మన ముగ్గురిలోనే ఒకరు వెళ్లిపోయే అవకాశం ఉంది’ అంటూ జోష్యం చెప్పుకుంది.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

ఇక, వాసంతి తాజా ఎపిసోడ్‌లో గీతూ రాయల్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఫుటేజ్ విషయంలో చాలా మంది గీతూకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే, అది మంచిదా చెడ్డదా అని ఎవరూ ఆలోచిండం లేదు. ఫుటేజ్ ఇస్తుందనే వాళ్లంతా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. నా వరకూ కావాలని గొడవలు పెట్టుకుని ఫుటేజ్ క్రియేట్ చేసుకోవడం చాలా సిల్లీగా ఉంటుంది’ అని చెప్పింది.

తర్వాత వాసంతి ‘షోలో చివరి వరకూ ఉన్నామా లేదా అని కాదు. బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కవారం ఉన్నా లక్ అనే చెప్పాలి. నాకు హౌస్‌‌మేట్స్ ఎవరూ నచ్చలేదు. కంటెంట్ ఇవ్వడానికి ఎవరూ నాకు సపోర్ట్ చేయడం లేదు. పిచ్చిదానిలా నేనొక్కదాన్నే మాట్లాడుకుంటే కంటెంట్ ఏమి వస్తుంది? నాకు సపోర్ట్ ఇస్తే కంటెంట్ ఇస్తా.. కానీ నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్లు లేరు’ అని బాధపడింది.