Bigg Boss Telugu 6: అక్క తానే, క్రష్ తానేనట.. సిరి, షణ్ముఖ్ లా మరో జంట సరసాలు!

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో 19వ రోజు 20వ ఎపిసోడ్ కూడా రసవత్తరంగానే సాగింది. అరుపులు, గొడవలు, కేకలు అంతగా లేవు కానీ అలకలు, కవ్వింపులు, క్రష్ అంటూ మాటలు వంటివి నడిచాయి. మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ రెండో లెవెల్ టాస్క్ ను నిర్వహించాడు బిగ్ బాస్. ఈ లెవెల్ లో ఆది రెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య పోటీ పడ్డారు. ఎత్తర జెండా అంటూ సాగిన ఈ టాస్క్ లో తన జెండా ఉన్న తొట్టెలో ఎక్కువ ఇసుక నింపి తన జెండా ముందుగా ఎగరేశాడు ఆది రెడ్డి. దీంతో అతన్ని కెప్టెన్ గా ప్రకటించారు. కెప్టెన్ అయిన సంతోషంలో ఐలవ్యూ కవిత అంటూ తన భార్యపై ప్రేమ చూపించాడు.

అనంతరం కెప్టెన్ గా ఫినోలెక్స్ పైపులపై కూర్చొబెట్టారు. అర్జున్ రెడ్డికి ఎదురు లేదు.. ఆది రెడ్డికి తిరుగు లేదు అంటూ హౌజ్ మేట్స్ ఉత్సాహపరిచారు. దీని తర్వాత ఇంటి సభ్యులు ఎన్ని నిమిషాల కంటెంట్ ఇస్తున్నారనే కార్యక్రమం జరిగింది. ఎవరి ఎన్ని నిమిషాలు ఇచ్చారనే టాపిక్ పై ఓటింగ్ వేసి, వారికి ఆ బోర్డ్ లను మెడలో తగిలించాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. 10 నిమిషాల కంటెంట్ ఇస్తున్నట్లు గీతూ రాయల్ సెలెక్ట్ అయింది. ఇలా ఒక్కొక్కరికి కొన్ని నిమిషాల బోర్డులు వచ్చాయి. కొంతమందికి జీరో కూడా వచ్చింది.

ఇదిలా ఉంటే రాజశేఖర్ (రాజ్), గీతూ రాయల్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాజుకు నేను క్రష్.. నాకు రాజు క్రష్ అని గీతూ రాయల్ అంది. దీంతో గీతూకు రాజ్ కన్ను కొట్టాడు. ఏ.. కన్ను కొడుతున్నావా.. అంటూ సపోర్టింగ్ గానే మాట్లాడింది గీతూ రాయల్. తర్వాత మరి నేను.. నాకు అంటూ ఫైమా అంది. ఆ తర్వాత రాజ్ కు నేనే అక్కనట.. క్రష్ కూడా నట అని గీతూ చెప్పింది. దీనికి నాకు గీతూ అని రాదు ఏ గీతక్క.. అని అలానే వస్తుంది అంటూ నవ్వేశాడు రాజ్.

ఇందతా వింటున్న ఫైమా.. ఆ డోర్ తెరుచుకుంటుందా.. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. అక్కనట.. క్రష్ అట.. అని చెప్పింది. ఏంట్రా మా అక్కతో.. అంటూ ఆది రెడ్డి అంటే.. ఏంటీ మీ అక్కతో.. అని అంటూ రాజ్ నవ్వాడు. ఇదిలా ఉంటే ఆరోహి రావు, ఆర్జే సూర్య ముచ్చట్లు, అలకలు, కవ్వింపులు చూస్తుంటే గత సీజన్ లోని సిరి, షణ్ముఖ్ లను తలపించినట్లుగా అనిపిస్తోంది.

తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో సూర్య తనపై అరిచాడని ఆరోహి రావు అలిగింది. అంతేకాకుండా ఏడుస్తూ కూర్చుంది. దీంతో అక్కడి నుంచి సూట్ కేసుల రూమ్ కు వెళ్లిపోతాడు ఆర్జే సూర్య. ఇక్కడ ఆరోహి రావును శ్రీహాన్ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. వాడేగా అరిచింది అని శ్రీహాన్ అంటే వాడు కాబట్టే ఫీల్ అవుతున్నా.. వేరే వాళ్లయితే నేను అంటాను కదా అని ఆరోహి సమాధానం ఇచ్చింది.

తర్వాత ఏంటీ ఆ సౌండ్స్ అని శ్రీహాన్ అంటే.. ఆ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తున్నాడా అని అక్కడికి వెళ్తుంది ఆరోహి. కానీ సూట్ కేస్ రూమ్ లో దొంగచాటుగా స్వీట్లు తింటూ ఫన్ క్రియేట్ చేశాడు. ఆరోహి వచ్చేసరికి మాత్రం పడుకున్నట్లు నటిస్తాడు. ఏమైంది.. అంటూ ఆరోహి అడుగుతుంది. తర్వాత కొద్ది మాటల తర్వాత సరే సారీ అని ఆరోహి చెబుతుంది. ఎప్పుడు నేనే రావడం, సారి చెప్పడం అవుతుంది అంటూ సూర్యతో ఆరోహి అంటుంది.

అంతేకాకుండా అర్థరాత్రి ఫ్రైస్ చేసుకుని ఆరోహి రావు, సూర్య తినడం, వారి మాటలు చూస్తుంటే లవ్ ట్రాక్ లా అనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ హౌజ్ కు రాకముందు ఆర్జే సూర్య, ఆరోహి రావు బయట మూడేళ్లుగా మంచి స్నేహితులు. ఇక ఇదిలా ఉంటే వరెస్ట్ ఫర్ఫామర్ గా అర్జున్ కల్యాణ్ జైలుకు వెళతాడు. అయితే ఆరోహి రావు, కీర్తి భట్, అర్జున్ ముగ్గురికి జీరో ట్యాగ్ వస్తుంది. వీరి ముగ్గురిలో జైలుకు వెళ్లేందుకు అర్జున్ సిద్ధమై వెళతాడు. మరోవైపు తనకు జీరో ట్యాగ్ వచ్చినందుకు కీర్తి భట్ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది.