Amala Paul: బీచ్ లో అమలా పాల్ హాట్ షో.. మరి ఇంత అరాచకమా!

లవ్​ ఫెయిల్యూర్​ సినిమాలో సాదాసీదాగా కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకుల వద్ద గుర్తింపు పొందింది కేరళ బ్యూటీ అమలా పాల్. అనంతరం రామ్​ చరణ్ స్టార్ హీరోతో నాయక్ సినిమాతో హిట్ కొట్టినా తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి. ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అమలా పాల్ ఇప్పుడిప్పుడే విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే సినిమాల్లో పద్ధతిగా కనిపించే అమలా పాల్ సోషల్ మీడియాలో మాత్రం చేసే రచ్చ అంతా ఇంతా లేదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన బీచ్ ఫొటోలు యవత మతులు పోగెట్టేలా ఉన్నాయి.

ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన కథ, కథనాలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. తెలుగులో లూప్ సిద్ధాంతంతో వచ్చిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన అమలా పాల్ ఇటీవలే కడావర్ మూవీతో అలరించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది అమలాపాల్.

ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ విపరీతంగా హైలైట్ అవుతోంది.

అయితే సినిమాల్లో అందమైన కట్టుబొట్టుతో కనిపించే అమలా పాల్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. ఇటీవల ఆమె పెట్టే పోస్టులు చూస్తుంటే బీచ్ వేకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ లు మరి అరచకం సృష్టిస్తున్నాయి. ఇటీవలే థైస్ ఎక్స్ పోజ్ అయ్యేలా ఫొటోలు షేర్ చేయగా తాజాగా పొట్టి దుస్తుల్లో ఎద అందాలతో పాటు షోల్డర్ బ్యూటీని ఘాటుగా ప్రదర్శించింది.

ఓ వైపు నీలి సముద్రం.. మరోవైపు అమలా పాల్ అందంతో కమెరాకు ఇచ్చిన పోజులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా చిన్న వయసులోనే అమలా పాల్ ‘నీల తామర’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘బెజవాడ’ అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ ‘జెండాపై కపిరాజు’ మూవీలు చేసినా హిట్ కొట్టలేదు.

తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన ఈ ఇద్దరూ.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ అంశం నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది.

విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రం వరుసగా మూవీలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం ‘ఆమె/అడై’ అనే సినిమాలో నగ్నంగా నటించి రచ్చ చేసింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. దీని తర్వాత ఆమె జెట్ స్పీడ్‌తో వెళ్తోంది.