Adani Family: IIFL టాప్-10 సంపనుల్లో అదానీ అన్నయ్య.. ఫ్యామిలీ మెుత్తం రిచ్.. వామ్మో ఇంత సంపాదనా..

         For Quick Alerts  

Subscribe Now          

Adani Family: IIFL టాప్-10 సంపనుల్లో అదానీ అన్నయ్య.. ఫ్యామిలీ మెుత్తం రిచ్.. వామ్మో ఇంత సంపాదనా..  

For Quick Alerts  

ALLOW NOTIFICATIONS          

bredcrumb

bredcrumb

     |                                                                                     Published: Friday, September 23, 2022, 18:08 [IST]                                     

Adani Family: రోజూ అదానీ పేరు వార్తల్లో ఏదో ఒక కారణంగా వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన సోదరుడి పేరు వినిపించటం మెుదలైంది. వినోద్ శాంతిలాల్ అదానీ దుబాయ్‌లో నివసిస్తున్నారు. సింగపూర్, దుబాయ్, జకార్తాలో వ్యాపారాలను చూసుకుంటున్నారు. 1976లో ముంబయిలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సింగపూర్‌కి విస్తరించారు. గౌతమ్ అదానీ అన్నయ్య 1994లో దుబాయ్ వెళ్లిన తర్వాత తన వ్యాపారాన్ని మిడిల్ ఈస్ట్‌కు కూడా తీసుకెళ్లారు.

IIFL తాజా నివేదిక..   

IIFL తాజా నివేదిక..

IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్- 2022 ప్రకారం వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా సంపద రేసులో వెనుకంజ వేయలేదు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త వినోద్ శాంతిలాల్ అదానీ రూ.1,69,000 కోట్ల సంపదతో ఆరవ స్థానంలో అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. గత ఐదేళ్ల కాలంలో వినోద్ శాంతిలాల్ అదానీ సంపద 9.5 రెట్లు పెరిగింది. శాంతిలాల్ వ్యాపారాలు..

శాంతిలాల్ వ్యాపారాలు..

వినోద్ శాంతిలాల్ అదానీ ఇంధనం, మౌలిక సదుపాయాల వ్యాపారంలో సోదరుడు గౌతమ్ అదానీ మాదిరిగానే కొనసాగుతున్నారు. గత ఐదేళ్లలో గౌతమ్ అదానీ కుటుంబ సంపద 15.4 రెట్లు పెరిగింది. అదే సమయంలో వినోద్ శాంతిలాల్ అదానీ సంపదం మాత్రం 9.5 శాతం పెరిగింది. ఈ క్రమంలో అతని నికర విలువ 28% లేదా రూ.36,969 కోట్లు పెరిగింది.  రోజువారీ సంపద సృష్టి..

రోజువారీ సంపద సృష్టి..

వినోద్ శాంతిలాల్ అదానీ 2021 నుంచి ప్రతిరోజూ రూ.102 కోట్లకు పైగా సంపాదించారు. ఇద్దరు అదానీ బ్రదర్స్ మొత్తం సంపద రూ.12,63,400 కోట్లు పెరిగింది. హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్ 2022లోని టాప్ టెన్‌లో 40% గా ఉంది. విడుదల చేసిన జాబితాలో 1,103 మంది భారతీయులు ఉండగా.. అందులో మొత్తం 94 మంది ఎన్నారైలు ఉన్నారు. NRIల జాబితాలో అదానీ కుటుంబం మాత్రం టాప్ గేర్ లో ముందుకు సాగుతోంది. English summary

adani brother Vinod Shantilal Adani stood as 6th richest person in iifl hurun indian rich list 2022

adani brother Vinod Shantilal Adani stood as 6th richest person in iifl hurun indian rich list 2022

Story first published: Friday, September 23, 2022, 18:08 [IST]